సన్ డెరైక్ట్ మొబైల్ యాప్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) సేవలందించే సన్ డెరైక్ట్ సంస్థ కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మై సన్ డెరైక్ట్ మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై అందిస్తున్నామని సన్ డెరైక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా క్విక్ రీచార్జ్ చేసుకోవచ్చని, ప్యాకేజీల, డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలను తెలుసుకోవచ్చని వివరించింది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్యాకేజీలను అందిస్తున్నామని, ఎస్‌డీ, హెచ్‌డీ బాక్సుల ద్వారా ఉచితంగా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చని తెలిపింది. సన్ షైన్ స్టోర్స్ పేరుతో దేవ్యాప్తంగా 300 ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తున్నామని సన్ డెరైక్ట్ పేర్కొంది.