డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం
పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం..
న్యూఢిల్లీ: దేశీ శాటిలైట్ కేబుల్ టీవీ ప్రసారాల(డీటీహెచ్) పరిశ్రమలో అతిపెద్ద డీల్‌కు తెరలేచింది. సుభాష్ చంద్ర సారథ్యంలోని ఎసెల్ గ్రూప్ కంపెనీ డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం అవుతోంది. ఈ ఒప్పందానికి తమ డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపినట్లు ఇరు కంపెనీలు శుక్రవారం సంయుక్తంగా ప్రకటించారుు. పూర్తిగా షేర్ల రూపంలోనే ఈ డీల్ ఉంటుందని పేర్కొన్నారుు. విలీనం తర్వాత ఏర్పడే ఉమ్మడి కంపెనీ డిష్ టీవీ వీడియోకాన్ లిమిటెడ్‌గా మారుతుంది.
ఈ కొత్త కంపెనీలో వీడియోకాన్ గ్రూప్‌నకు 44.6 శాతం, ఎస్సెల్ గ్రూప్‌నకు 55.4 శాతం చొప్పున వాటాలు ఉంటారుు. దేశంలోనే అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్‌గా ఈ కొత్త కంపెనీ ఆవిర్భవిస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విలీనం అవుతున్న రెండు కంపెనీల మొత్తం ఆదాయం రూ.5,916 కోట్లుగా ఉంది. కాగా, ఈ లావాదేవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంకల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. సెబీ, కాంపిటీషన్, బాంబే హైకోర్టు, ఇతరత్రా నియంత్రణ సంస్థలు, రుణదాతల ఆమోదానికి లోబడి ఒప్పందం ఉంటుంది.
కాగా, విలీనం తర్వాత ఏర్పడే ‘డిష్‌టీవీ వీడియోకాన్’ కంపెనీ ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్టింగ్ సంస్థగా కొనసాగుతుంది. అదేవిధంగా లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్(జీడీఆర్)లు లిస్టవుతారుు. ప్రస్తుతం అమెరికాలోని నాస్‌డాక్ ఎక్స్ఛేంజీలో వీడియోకాన్ డీ2హెచ్ లిస్టరుు(ఏడీఆర్‌లు) ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి వాటాదారులకు విలీన సంస్థకు చెందిన జీడీఆర్‌లను జారీ చేయనున్నట్లు సంయుక్త ప్రకటన పేర్కొంది.