Videocon D 2 H
-
డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం
పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం.. న్యూఢిల్లీ: దేశీ శాటిలైట్ కేబుల్ టీవీ ప్రసారాల(డీటీహెచ్) పరిశ్రమలో అతిపెద్ద డీల్‌కు తెరలేచింది. సుభాష్ చంద్ర సారథ్యంలోని ఎసెల్ గ్రూప్ కంపెనీ డిష్ టీవీలో వీడియోకాన్ డీ2హెచ్ విలీనం అవుతోంది. ఈ ఒప్పందానికి తమ డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపినట్లు ఇరు కంపెనీలు శుక్రవారం సంయుక్తంగా ప్రకటించారుు. పూర్తిగా షేర్ల రూపంలోనే ఈ డీల్ ఉంటుందని పేర్కొన్నారుు. విలీనం తర్వాత ఏర్పడే ఉమ్మడి కంపెనీ డిష్ టీవీ వీడియోకాన్ లిమిటెడ్‌గా మారుతుంది. ఈ కొత్త కంపెనీలో వీడియోకాన్ గ్రూప్‌నకు 44.6 శాతం, ఎస్సెల్ గ్రూప్‌నకు 55.4 శాతం చొప్పున వాటాలు ఉంటారుు. దేశంలోనే అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్‌గా ఈ కొత్త కంపెనీ ఆవిర్భవిస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విలీనం అవుతున్న రెండు కంపెనీల మొత్తం ఆదాయం రూ.5,916 కోట్లుగా ఉంది. కాగా, ఈ లావాదేవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంకల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. సెబీ, కాంపిటీషన్, బాంబే హైకోర్టు, ఇతరత్రా నియంత్రణ సంస్థలు, రుణదాతల ఆమోదానికి లోబడి ఒప్పందం ఉంటుంది. కాగా, విలీనం తర్వాత ఏర్పడే ‘డిష్‌టీవీ వీడియోకాన్’ కంపెనీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో లిస్టింగ్ సంస్థగా కొనసాగుతుంది. అదేవిధంగా లగ్జెంబర్గ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్(జీడీఆర్)లు లిస్టవుతారుు. ప్రస్తుతం అమెరికాలోని నాస్డాక్ ఎక్స్ఛేంజీలో వీడియోకాన్ డీ2హెచ్ లిస్టరుు(ఏడీఆర్‌లు) ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి వాటాదారులకు విలీన సంస్థకు చెందిన జీడీఆర్‌లను జారీ చేయనున్నట్లు సంయుక్త ప్రకటన పేర్కొంది. -
వీడియోకాన్ డీ2హెచ్ లో మరిన్ని తెలుగు చానళ్లు
హైదరాబాద్: దేశీ ప్రముఖ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ ‘వీడియోకాన్ డీ2హెచ్’ తాజాగా తన తెలుగు ప్లాట్‌ఫామ్‌కు మరో మూడు కొత్త చానళ్లను జతచేసింది. కొత్తగా ఈటీవీ సినిమా, ఈటీవీ తెలంగాణ, డీడీ యాదగిరి అనే తెలుగు చానళ్లను ప్రసారం చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈటీవీ సినిమా అనే తెలుగు మూవీ చానల్ 716 నెంబర్లో, తెలంగాణ రాష్ట్ర దూరదర్శన్‌కు సంబంధించిన డీడీ యాదగిరి అనే చానల్ 745 నె ంబర్‌లో, ఈటీవీ తెలంగాణ అనే న్యూస్ చానల్ 734 నెంబర్లో వస్తాయని పేర్కొంది. దీంతో వీడియోకాన్ మొత్తంగా 43 తెలుగు చానళ్లను ప్రసారం చేస్తోంది. కొత్త చానళ్లతో తమ మార్కెట్ మరింత పెరుగుతుందని సంస్థ సీఈవో అనిల్ ఖెరా అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకావడానికి తమ చర్య దోహదపడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సౌరభ్ దత్ తెలిపారు. -
వీడియోకాన్ వైఫై స్మార్ట్ హెచ్ డీ సెట్ టాప్ బాక్స్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఉన్న వీడియోకాన్ డీ2హెచ్ తాజాగా ఇన్‌బిల్ట్ వైఫైతో స్మార్ట్ హెచ్డీ సెట్ టాప్ బాక్స్‌ను రూపొందించింది. దీనితో ఎల్ఈడీ టీవీ కాస్తా స్మార్ట్ టీవీగా మారిపోతుంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌తోపాటు వీడియో షేరింగ్ వెబ్సైట్ అయిన డైలీ మోషన్, మూవీస్, ఓవర్ ద టాప్ యాప్స్, వీడియో ఆన్ డిమాండ్ సైట్లు వీక్షించొచ్చు. మొబైల్ ఇంటర్నెట్, వైఫై, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఈ సెట్ టాప్ బాక్స్‌కు కనెక్ట్ అవ్వొచ్చు. ఎక్స్టర్నల్ రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. తదుపరి తరం ఉత్పత్తుల తయారీలో సంస్థ సామర్థ్యానికి ఇది నిదర్శనమని వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 525 చానెళ్లు, సర్వీసులను కంపెనీ అందిస్తోంది. -
వీడియోకాన్ డీ2హెచ్ కంటెంట్ హెడ్‌గా హిమాన్షు
వీడియోకాన్ డీ2హెచ్ కంటెంట్ చీఫ్‌గా హిమాన్షు ధొరీలియా నియమితులయ్యారు. ప్రముఖ మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీల్లో పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉంది. ఇటీవల ఆయన టెలివిజన్పోస్ట్.కామ్ సీఈఓ, సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. వీడియోకాన్ కంటెంట్ మరింత మెరుగుకు ఈ నియామకం దోహదపడుతుందని ఒక ప్రకటనలో వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించడానికి హిమాన్షు ధొరీలియా ప్రణాళికలు ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నట్లు సీఈఓ అనిల్ ఖేరా తెలిపారు. దాదాపు 525 చానెళ్ల ప్రసారం, సేవలతో వీడియోకాన్ డీ2హెచ్ వేగంగా విస్తరిస్తోందని ప్రకటన తెలిపింది. -
వీడియోకాన్ డీ2హెచ్లో మరో రెండు చానల్స్
ముంబై: డెరైక్ట్ టు హోమ్ సేవల సంస్థ వీడియోకాన్ డీ2హెచ్ తాజాగా మరో రెండు హై-డెఫినిషన్ చానల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డీ, ఫాక్స్ లైఫ్ హెచ్‌డీలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. దీంతో తమ హెచ్డీ చానల్స్ సంఖ్య 37కి పెరిగినట్లు వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ తెలిపారు. స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డీలో ప్రతి నెలా రెండు కొత్త చిత్రాలు (గతంలో భారత్‌లో విడుదల కానివి) ప్రసారమవుతాయని, అలాగే ప్రతి రోజూ ఒక కొత్త మూవీ ప్రసారమవుతుందని ఆయన వివరించారు. ఫాక్స్ లైఫ్ హెచ్డీలో హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా ఆడియో సదుపాయం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పిల్లల కోసం వీడియోకాన్ డీ2హెచ్ ‘స్మార్ట్ సర్వీసెస్’
హైదరాబాద్ : వీడియోకాన్ డీ2హెచ్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల కోసం ‘స్మార్ట్ సర్వీసెస్’ ప్రారంభించింది. తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా లెర్నింగ్, గేమ్స్ వంటి అంశాలతో కూడిన ‘స్మార్ట్ సర్వీసెస్’ అనే వాల్యు-యాడెడ్ సర్వీసులను ప్రారంభించినట్లు వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.45లతో లభించే ఈ సర్వీసుల్లో స్మార్ట్ లెర్నింగ్, స్మార్ట్ కిడ్స్, స్మార్ట్ గేమ్స్ వంటివి ఉంటాయని పేర్కొంది. పాఠశాల విద్యార్థుల కోసం త్వరలోనే ‘స్మార్ట్ ఎడ్యుకేషన్’ అనే మరో వాల్యు-యాడెడ్ సర్వీస్‌ను ఆవిష్కరిస్తామని వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ తెలిపారు. -
వీడియోకాన్ డీ 2హెచ్లో మరో గుజరాతీ చానల్
హైదరాబాద్ : వీడియోకాన్ డీ2హెచ్ తన ప్లాట్‌ఫామ్ మీద మరో కొత్త చానల్‌ను వినియోగదారులకు అందిస్తోంది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ ప్రాంతీయ భాష చానల్ ‘సందేశ్ న్యూస్’ను తన ప్లాట్‌ఫామ్ మీద ప్రారంభించింది. సందేశ్ చానల్ ఒక 24/7 న్యూస్, కరెంట్ అఫైర్స్ చానల్. ఈ చానల్ ఎల్‌సీఎన్: 942 నంబర్లో వస్తుంది. వీడియోకాన్ డీ2హెచ్ ఈ చానల్‌తో కలుపుకొని మొత్తంగా 8 గుజరాత్ చానళ్లను తన ప్లాట్‌ఫామ్ మీద వినియోగదారులకు అందిస్తోంది. -
వీడియోకాన్ డీ2హెచ్ నుంచి టీఎల్సీ హెచ్డీ ఛానల్
ముంబై: వీడియోకాన్ డీ2హెచ్ ‘టీఎల్సీ’ హెచ్డీ ఛానల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో తమ 35 హెచ్డీ ఛానల్స్, సర్వీసుల సామర్థ్యం మరింత పెరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లాట్ ప్యానల్ టీవీల వినియోగం పెరుగుతుండటంతో హెచ్డీ ఛానల్స్‌ను వీక్షించేవారి సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదౌతోందని తెలియజేసింది. -
ప్రకటనలకు మాది చక్కటి వేదిక
కంపెనీలు తమ వాణిజ్య లక్ష్యాలను చేరుకోవడానికి ఇచ్చే ప్రకటనలకు తమ వేదిక అత్యుత్తమమైనదని వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోక్స్‌వ్యాగన్, హీరో, మింత్రా, హోండా, ఏసియన్ పెయింట్స్, యప్ మీ, ఎస్బీఐ జనరల్, టాటా ఏఐజీ, డిస్నీ, కలర్స్, స్టార్ స్పోర్ట్స్, సోనీ టీవీ, జీ గ్రూప్ వంటి ప్రముఖ బ్రాండ్లు వీడియోకాన్ డీ2హెచ్‌పై ఎంతో విశ్వాసముంచాయని సీఈఓ అనిల్ ఖేరా ప్రకటనలో వివరించారు. ఆయా బ్రాండ్లు తమ ప్రకటనల అంశాన్ని విస్తృత స్థాయిలో వినియోగదారుల్లోకి తీసుకువెళ్లడంలో ‘వీడియోకాన్ డీ2హెచ్ హోమ్, రీజినల్ చానెళ్ల’ ద్వారా అపరిమిత ప్రయోజనాలు పొందాయని అన్నారు.