పిల్లల కోసం వీడియోకాన్ డీ2హెచ్ ‘స్మార్ట్ సర్వీసెస్’
హైదరాబాద్ : వీడియోకాన్ డీ2హెచ్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల కోసం ‘స్మార్ట్ సర్వీసెస్’ ప్రారంభించింది. తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా లెర్నింగ్, గేమ్స్ వంటి అంశాలతో కూడిన ‘స్మార్ట్ సర్వీసెస్’ అనే వాల్యు-యాడెడ్ సర్వీసులను ప్రారంభించినట్లు వీడియోకాన్ డీ2హెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.45లతో లభించే ఈ సర్వీసుల్లో స్మార్ట్ లెర్నింగ్, స్మార్ట్ కిడ్స్, స్మార్ట్ గేమ్స్ వంటివి ఉంటాయని పేర్కొంది. పాఠశాల విద్యార్థుల కోసం త్వరలోనే ‘స్మార్ట్ ఎడ్యుకేషన్’ అనే మరో వాల్యు-యాడెడ్ సర్వీస్‌ను ఆవిష్కరిస్తామని వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ తెలిపారు.