వీడియోకాన్ వైఫై స్మార్ట్ హెచ్ డీ సెట్ టాప్ బాక్స్
హైదరాబాద్: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో ఉన్న వీడియోకాన్ డీ2హెచ్ తాజాగా ఇన్‌బిల్ట్ వైఫైతో స్మార్ట్ హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్‌ను రూపొందించింది. దీనితో ఎల్‌ఈడీ టీవీ కాస్తా స్మార్ట్ టీవీగా మారిపోతుంది. సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌తోపాటు వీడియో షేరింగ్ వెబ్‌సైట్ అయిన డైలీ మోషన్, మూవీస్, ఓవర్ ద టాప్ యాప్స్, వీడియో ఆన్ డిమాండ్ సైట్లు వీక్షించొచ్చు. మొబైల్ ఇంటర్నెట్, వైఫై, కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఈ సెట్ టాప్ బాక్స్‌కు కనెక్ట్ అవ్వొచ్చు. ఎక్స్‌టర్నల్ రికార్డింగ్ సౌకర్యం కూడా ఉంది. తదుపరి తరం ఉత్పత్తుల తయారీలో సంస్థ సామర్థ్యానికి ఇది నిదర్శనమని వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 525 చానెళ్లు, సర్వీసులను కంపెనీ అందిస్తోంది.