వీడియోకాన్ డీ2హెచ్ నుంచి టీఎల్‌సీ హెచ్‌డీ ఛానల్
ముంబై: వీడియోకాన్ డీ2హెచ్ ‘టీఎల్‌సీ’ హెచ్‌డీ ఛానల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో తమ 35 హెచ్‌డీ ఛానల్స్, సర్వీసుల సామర్థ్యం మరింత పెరిగిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లాట్ ప్యానల్ టీవీల వినియోగం పెరుగుతుండటంతో హెచ్‌డీ ఛానల్స్‌ను వీక్షించేవారి సంఖ్యలో గణనీయమైన వృద్ధి నమోదౌతోందని తెలియజేసింది.