న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ డీటీహెచ్(డైరెక్ట్ టు హోమ్) విభాగంలో 20% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్‌బర్గ్ పిన్‌కస్ కొనుగోలు చేయనుంది. డీటీహెచ్ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20% వాటాను వార్‌బర్గ్ అనుబంధ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది.
ఈ డీల్ విలువ రూ.2,310 కోట్లు(35 కోట్ల డాలర్లు) అని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. వార్‌బర్గ్ పిన్‌కస్ తమ నుంచి 15% వాటాను, మరో అనుబంధ సంస్థ నుంచి 5% వాటాను కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో ఇరు సంస్థల మధ్య విజయవంతమైన భాగస్వామ్యం నెలకొందని, మరొక్కసారి వార్‌బర్గ్‌తో జట్టు కట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత డిజిటల్ టీవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఎయిర్‌టెల్ డీటీహెచ్ విభాగం మంచి వృద్ధిని సాధించగలదన్న అంచనాలున్నాయని వార్‌బర్గ్ పిన్‌కస్ ఇండియా ఎండీ, విశాల్ మహాదేవ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment