
సాక్షి, హైదరాబాద్: సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయప్రదాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తే..సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించా రు. ‘దీనిపై నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు స్పందించరు? హిందూధర్మాన్ని కించపర్చడం, హిందువులను హేళన చేయడమే ఐఎన్డీఐఏ కూటమి ఎజెండాగా కనిపిస్తోంది.
ఉదయనిధి స్టాలిన్ వంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూసమాజాన్ని కోరుతున్నాం’అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అమెరికాలో పర్యటనలో భాగంగా బండి సంజయ్ నార్త్ కరోలినాలోని చార్లెట్‌లోని హిందూ సెంటర్‌లో ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో పాల్గొన్నారు.