పెరంబూరు: తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ నాకు బలం కాదని, బలహీనతని వారి వారసుడు, నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ పేర్కొన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధిస్టాలిన్. ఈయన మంగళవారం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాతకు, తండ్రికి ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన తాను రాజకీయాల్లోకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నిం చారు.
తక్కువ సమయంలోనే ప్రజల్లో పేరు సంపాదించుకోవడం ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. తాత కరుణానిధి, నాన్న స్టాలిన్ మీకు బలమా..? అన్న ప్రశ్నకు కచ్చితంగా బలహీనతే అన్నారు. ఒకరు పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పాటు పడుతుంటే ప్రశంసలు లభిస్తాయన్నారు. తన విషయంలో అలా జరగడంలేదన్నారు. డీఎంకే అంటేనే కుటుంబ పాలన అనే విమర్శ ఉందే? అన్న ప్రశ్నకు దీనికి నాన్న విషయంలోనే సమాధానం ఉందన్నారు. నిరంతర శ్రమతో ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కఠిన శ్రమతోనే నాన్నకు అధ్యక్షుడి అర్హత వచ్చిందని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment