Shakeela And Prema Priya Comments On Vadivelu - Sakshi
Sakshi News home page

Vadivelu: 'వడివేలు ఏం అడుగుతాడో తెలుసు.. నాకు ఛాన్స్‌లు లేకుండా చేశాడు'

Published Sun, Aug 13 2023 6:38 PM | Last Updated on Mon, Aug 14 2023 9:28 AM

Shakeela And Prema Priya Comments On Vadivelu - Sakshi

చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన వడివేలు మామన్నన్‌ చిత్రం ద్వారా సూపర్‌ హిట్‌ అందుకున్నారు.  ఈ సినిమాలో అతని నటన చాలా అద్భుతంగా ఉంటుందనడంలో ఎంలాంటి సందేహం ఉండదు. తాజాగా  పలువురు నటీనటులు ఆయనపై పలు ఆరోపణలు చేస్తుంటే నటి షకీలా మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఆయన గురించి బహిరంగంగానే మాట్లాడింది.

(ఇదీ చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్‌ కెరీర్‌ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో)

90వ దశకంలో హాట్ నటిగా వెలుగొందిన నటి షకీలా తమిళంలోనే కాకుండా పలు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. గ్లామర్ చిత్రాల్లోనే నటించే షకీలా.. ఇప్పుడు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో తనదైన నటనను ప్రదర్శిస్తోంది. తమిళ్‌ విజయ్ టీవీలో 'కుక్ విత్ కోమలి' షో తర్వాత షకీలా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం నటీనటులను ఇంటర్వ్యూ చేస్తోంది.  అందులో భాగంగానే తమిళ నటి అయిన ప్రేమ ప్రియను కూడా షకీలా ఇంటర్వ్యూ చేసింది 

వడివేలు గురించి ప్రేమ ప్రియ కామెంట్‌
నా సినిమా కెరీయర్‌ ప్రారంభంలో వడివేలు, వివేక్, సంతానం వంటి హాస్య నటులతో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. నాకు అప్పట్లో మంచి అవకాశాలే వచ్చేవి. ఇండస్ట్రీలో నా ఎదుగుదలకు వడివేలు అడ్డుకట్ట వేశారు. సినిమాల్లో నటించే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ ఆయన వల్ల అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఒక్కోసారి ఏదోరకంగా అవకాశం వచ్చింది కదా అని నేను షూటింగ్‌కు వెళ్తాను.. కానీ వడివేలు నన్ను చూడగానే ఈ అమ్మాయి వద్దని అక్కడి మూవీ మేకర్స్‌తో చెప్పించి  వెనక్కి పంపేవారు. ఇలా చాలా సినిమాల్లో ఇదే జరిగింది.' అని ప్రేమ ప్రియ తెలిపింది.

బెదిరించారు
ఒక దర్శకుడు నన్ను ఫోన్‌లో బెదిరించాడు. నేను యూట్యూబ్ ఛానెల్‌లో వడివేలు గురించి  చెప్పిన మాటల్లో నిజం లేదని తిరిగి తెలపాలని ఒకరు వార్నింగ్‌ ఇచ్చారు. అందుకు నేను బయపడలేదు. వడివేలు గురించి ఏదైతే నిజమో అదే చెప్పాను. 2010లో వచ్చిన విజయ్‌ 'సురా' సినిమాలో వడివేలుతో కలిసి నటించినప్పుడు కూడా ఆయన నో చెప్పారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. కారణం ఏంటో చెప్పరు.' అని ప్రేమ ప్రియ తెలిపింది.

వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు
వడివేలుపై మీ-టూ ఫిర్యాదు చేసి ఉండవచ్చు కదా అని  షకీలా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా  వడివేల్‌కి, తనకు మీ టూ సమస్య లేదని, అది వేరే సమస్య అని ప్రేమ ప్రియ చెప్పింది. అయితే వడివేలు తనకు బాగా తెలుసని షకీలా పేర్కొంది. షూటింగ్ స్పాట్‌లో ఎలా ఉంటాడో, ఏం అడుగుతాడో తనకు బాగా తెలుసని నటి షకీలా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement