
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన కొంతమంది నటీనటులకు పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. జైలర్ సినిమా ద్వితీయార్ధంలో కామెడీ ట్రాక్‌లో అతను తమన్నా లవర్‌గా, సినిమా డైరెక్టర్ బాగున్నారా బాలు పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అంతటా అతని గురించే చర్చ జరుగుతుంది. ఇంతకు అతను ఎవరో కాదు.. టాలీవుడ్‌కు చెందిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ కోదండ రామిరెడ్డి పెద్ద కుమారుడు. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారు.
(ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ )
ఇకపోతే జైలర్‌లో సునీల్ రెడ్డి పాత్ర ఎక్కడొస్తుందటే.. తెలుగు ప్రముఖ నటుడు అయిన సునీల్, తమన్నా పాత్రల మధ్య సునీల్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సునీల్ ఇస్తున్న గిఫ్ట్‌లను తీసుకుని తమన్నాకు ఇస్తుంటాడు. సునీల్, తమన్నా మధ్య జరిగే సీన్లలో సునీల్ రెడ్డి మెప్పిస్తాడు. సునీల్‌లాగే విగ్‌తో సహా కామెడీ ఎలిమెంట్స్‌ని వివిధ సన్నివేశాల్లో అతను అలరించాడు. ఈ మధ్యే విడుదలైన మామన్నన్ సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్‌కు అన్నయ్య పాత్రలో కాలేజీ యజమానిగా మెప్పించాడు.
(ఇదీ చదవండి: శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు.. ఆర్థికంగా అన్నీ కోల్పోయాం: డిస్కో శాంతి)
సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి కూడా తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట 'గొడవ' అనే సనిమా తీసినా.. ఇక్కడ కాంపీటేషన్ ఎక్కువ కావడంతో వైభవ్ తమిళ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. తన సోదరుడి అడుగుజాడల్లో, సునీల్ రెడ్డి సినీ ప్రపంచంలోకి ప్రవేశించాడు, ప్రధానంగా హాస్య పాత్రలతో ఆయన అక్కడ పేరుగాంచాడు. సునీల్ రెడ్డి ఇప్పటి వరకు మాస్టర్, బీస్ట్, డాక్టర్, మామన్నన్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. డాక్టర్ చిత్రంలో సునీల్ రెడ్డి నటనకు ఫిదా అయిన నెల్సన్ జైలర్‌లో మరో అవకాశం ఇచ్చాడు. అలా తమిళనాట సునీల్ రెడ్డి కూడా ట్రెండింగ్ నటుల జాబితాలో చేరిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment