
ప్రస్తుతం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. అన్నాత్తే చిత్రం తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, వసంత్ రవి, నటి రమ్యకృష్ణ, తమన్న, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించారు.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్‌గా జైలర్ పాత్రలో నటించారు. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. జైలర్ చిత్రంలో కామెడీ సూపర్‌గా ఉంటుందని నటుడు యోగిబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌తో సహా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న జైలర్ చిత్రాన్ని ఆగస్టు 10వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం సినీ వర్గాలతో పాటు, రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా నటుడు రజనీకాంత్ వెంటనే తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రషూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్నారన్నది గమనార్హం.
It's a wrap for #Jailer! Theatre la sandhippom 😍💥#JailerFromAug10@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 pic.twitter.com/Vhejuww4fg
— Sun Pictures (@sunpictures) June 1, 2023
చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువ నటుడు మృతి
వారందరికీ నా ప్రగాఢ సానుభూతి: అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment