కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ నటుడు సునీల్, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 10వ తేదీన తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ వేదికపై నటుడు రజనీకాంత్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఇటీవల సూపర్ స్టార్ తానే అనే విషయంపై చాలా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రజనీ స్పందించారు. చిత్రంలోని హుకుమ్ అనే పాటలో సూపర్ స్టార్ అనే పదం చోటుచేసుకుందని, దాన్ని తాను తొలగించాల్సిందిగా చెప్పానన్నారు. నిజానికి సూపర్ స్టార్ అన్న పట్టం పెద్ద తలనొప్పి అని పేర్కొన్నారు. 1977లోనే దీనిపై పెద్ద వివాదం జరిగిందని, అప్పట్లో నటుడు కమలహాసన్, శివాజీ గణేషన్ ప్రముఖ నటులుగా రాణిస్తున్నారని, అలాంటి సమయంలో ఈ సూపర్ స్టార్ పట్టం తనకు ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసిందన్నారు.
ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలని అడవిలో ఒక గద్ద, కాకి ఉన్నాయని, అయితే కాకి గద్దకంటే పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుందని, కానీ ఎప్పటికీ గద్దను మించి ఎగరలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు విజయ్ గురించే మాట్లాడినట్టు చర్చ జరుగుతోంది. అదేవిధంగా తాను జీవితంలో ఇద్దరికే భయపడతానని అందులో ఒకరు భగవంతుడు, రెండోది మంచి మనుషులకు అని పేర్కొన్నారు. ప్రముఖుడి కొడుకు అని చెప్పటం ఈజీ అని అయితే ఆ పేరును కాపాడుకోవడం చాలా కష్టమని రజనీకాంత్ పేర్కొన్నారు.
చదవండి: 87 ఏళ్ల వయసులో లిప్‌లాక్.. రొమాన్స్‌కు వయసుతో పనేంటి? అన్న నటుడు
పెట్టుబడి రూ.6 లక్షలు, ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే?
Comments
Please login to add a commentAdd a comment