రమ్యమైన నటి రమ్యకృష్ణ. తొలి రోజుల్లో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలో మెప్పించారు. రజినీకాంత్‌తో కలిసి నటించిన 'నరసింహ' చిత్రానికి ముందు వరకు కథానాయకిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో రజనీకాంత్‌కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో రాజమాత శివగామిగా జీవించారు.
(ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి)
తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్‌కు భార్యగా అత్యంత సహజంగా నటించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో తనకు సరిగ్గా నటించడం తెలియలేదు అన్నారు. నటిగా తన తొలి చిత్రం తమిళంలో 'వైళ్లె మనసు' అని చెప్పారు.1988లో తమిళ్‌లో నటించిన ముదల్ వసంతం చిత్రాన్ని ఇటీవల చూసిన తన తల్లి నువ్వు ఇలాంటి నటనతో ఎంతకాలం ఎలా నిలబడగలిగావు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దీంతో అప్పట్లో తన నటన ఎలా ఉండేది అన్నది అర్థం చేసుకోండి అని అన్నారు.
అలా తాను తమిళంలో నటించిన పలు చిత్రాలు అపజయాన్ని చూడడంతో తెలుగు చిత్రంపై దృష్టి సారించానని అన్నారు. అయితే తెలుగులో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment