kodanda rami reddy
-
జైలర్‌లో టాలీవుడ్‌కు చెందిన లెజండరీ పర్సన్ వారసుడిని గుర్తించారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన కొంతమంది నటీనటులకు పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. జైలర్ సినిమా ద్వితీయార్ధంలో కామెడీ ట్రాక్‌లో అతను తమన్నా లవర్‌గా, సినిమా డైరెక్టర్ బాగున్నారా బాలు పాత్రలో కనిపిస్తాడు. ఇప్పుడు అంతటా అతని గురించే చర్చ జరుగుతుంది. ఇంతకు అతను ఎవరో కాదు.. టాలీవుడ్‌కు చెందిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ కోదండ రామిరెడ్డి పెద్ద కుమారుడు. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే జైలర్‌లో సునీల్ రెడ్డి పాత్ర ఎక్కడొస్తుందటే.. తెలుగు ప్రముఖ నటుడు అయిన సునీల్, తమన్నా పాత్రల మధ్య సునీల్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు. సునీల్ ఇస్తున్న గిఫ్ట్‌లను తీసుకుని తమన్నాకు ఇస్తుంటాడు. సునీల్, తమన్నా మధ్య జరిగే సీన్లలో సునీల్ రెడ్డి మెప్పిస్తాడు. సునీల్లాగే విగ్‌తో సహా కామెడీ ఎలిమెంట్స్‌ని వివిధ సన్నివేశాల్లో అతను అలరించాడు. ఈ మధ్యే విడుదలైన మామన్నన్ సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్‌కు అన్నయ్య పాత్రలో కాలేజీ యజమానిగా మెప్పించాడు. (ఇదీ చదవండి: శ్రీహరి చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు.. ఆర్థికంగా అన్నీ కోల్పోయాం: డిస్కో శాంతి) సునీల్ రెడ్డి తమ్ముడు వైభవ్ రెడ్డి కూడా తమిళ చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగు ఇండస్ట్రీలో మొదట 'గొడవ' అనే సనిమా తీసినా.. ఇక్కడ కాంపీటేషన్ ఎక్కువ కావడంతో వైభవ్ తమిళ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. తన సోదరుడి అడుగుజాడల్లో, సునీల్ రెడ్డి సినీ ప్రపంచంలోకి ప్రవేశించాడు, ప్రధానంగా హాస్య పాత్రలతో ఆయన అక్కడ పేరుగాంచాడు. సునీల్ రెడ్డి ఇప్పటి వరకు మాస్టర్, బీస్ట్, డాక్టర్, మామన్నన్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. డాక్టర్ చిత్రంలో సునీల్ రెడ్డి నటనకు ఫిదా అయిన నెల్సన్ జైలర్‌లో మరో అవకాశం ఇచ్చాడు. అలా తమిళనాట సునీల్ రెడ్డి కూడా ట్రెండింగ్ నటుల జాబితాలో చేరిపోయాడు. -
జూన్‌లో దర్శకులు మధుసూదనరావు శత జయంతి ఉత్సవాలు
ప్రముఖ దివంగత దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు (జూన్ 14, 1923లో జన్మించారు) శతజయంతి ఉత్సవాలు జూన్ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధుసూదనరావుగారు మన మధ్య లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల ఏళ్లు బతికే ఉంటుంది. ఆయన దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమ నుంచి అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు మధుసూదనరావు కుమార్తె వాణీదేవి. ‘‘ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, సూర్యకాంతంగారు, వి. మధుసూదనరావుగారి శత జయంతి కావడం తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. మన మధ్య లేకపోయినా వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాం’’ అన్నారు శివాజీరాజా. ‘‘మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు’’ అన్నారు నాని (మధుసూదనరావు మేనల్లుడు). ఈ కార్యక్రమంలో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డా. జి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
థియేటర్లు దొరక్క “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా” సినిమా వాయిదా
షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించిన తేజ్ కూరపాటి సోలో హీరోగా , అఖిల ఆకర్షణ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా”. రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ వందెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్స్ కొరత కారణంగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు మూవీ టీం ప్రకటించింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. -
‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ బిగ్ హిట్ కావాలి’
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ..‘అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి .ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి’ అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘వరుస అపజయాలతో నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీ కి ఊపిరి నింపాయి.మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ తో చిన్న సినిమా గా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారేలా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకొన్నాడు .ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి ’అన్నారు. చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ.. ఒక్క సినిమా చేయడం ఎంత కష్టమో ఈ చిత్రం ద్వారా తెలిసింది. ఒక్క మూవీ కోసం ఒక లైట్ బాయ్ దగ్గరనుండి నటీ నటులు, టెక్నిషియన్స్ వరకు ఎంతో మంది కష్టపడతారు. ఇలా వీరందరూ కలిస్తేనే ఒక సినిమాగా బయటకు వస్తుంది. అలాంటి సినిమాను అవమానంగా చూడద్దు అని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. మా సినిమాను మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాలని ప్రేక్షకులను కోరకుంటున్నాను’అని అన్నారు. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేస్తున్న ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు తనను ఆశ్వీర్వదించి, సినిమాను ఆదరించాలని హీరోల తేజ్ కురపాటి అన్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు . -
శ్రీదేవి మరణాన్ని నమ్మలేకపోతున్నా
-
నవ్విస్తూ... థ్రిల్‌కు గురి చేస్తూ...
సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్, రమ్యా నంబీశన్ జంటగా శ్రీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ఢమాల్ డుమీల్’ చిత్రం తెలుగులోకి ‘ధనాధన్’ పేరుతో విడుదల కానుంది. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని అనువదించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం కూర్చారు. ‘‘ఈ చిత్రం తమిళంలో విజయవంతమై, వైభవ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో కూడా విజయం సాధించి నిర్మాతలకు లాభాలు రావాలి. వైభవ్ తమిళంలో బిజీగా ఉన్నాడు. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు’’ అని కోదండ రామిరెడ్డి ఈ చిత్రం ఆడియో వేడుకలో పేర్కొన్నారు. ‘‘ఇది మంచి కామెడీ థ్రిల్లర్. ఈ నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని శివ వై.ప్రసాద్ అన్నారు. -
వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి
-
వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి
ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు ఆయన పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనేక విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శకుడిగా కోదండరామిరెడ్డికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానం ఉంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడుకు చెందిన కోదండరామిరెడ్డి.. ఒక్క ఎన్టీ రామారావు తప్ప దాదాపు అందరు అగ్రనటులతోను సినిమాలు తీశారు. వాటిలో 80 శాతానికి పైగా మంచి విజయాలు సాధించాయి. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం నాడు ఆయన పార్టీలో చేరారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేసిన నాగేశ్వరరావు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వై.టి.రాజాపై గెలిచారు.