వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి | tollywood director kodanda rami reddy joins ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి

Published Wed, Apr 9 2014 10:41 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి - Sakshi

వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి

ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు ఆయన పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అనేక విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శకుడిగా కోదండరామిరెడ్డికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానం ఉంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడుకు చెందిన కోదండరామిరెడ్డి.. ఒక్క ఎన్టీ రామారావు తప్ప దాదాపు అందరు అగ్రనటులతోను సినిమాలు తీశారు. వాటిలో 80 శాతానికి పైగా మంచి విజయాలు సాధించాయి.

అలాగే, పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం నాడు ఆయన పార్టీలో చేరారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేసిన నాగేశ్వరరావు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వై.టి.రాజాపై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement