థియేటర్లు దొరక్క “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” సినిమా వాయిదా | Naa Venta Padutunna Chinnadevadamma Movie Gets Postponed | Sakshi
Sakshi News home page

థియేటర్లు దొరక్క “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” సినిమా వాయిదా

Published Thu, Sep 1 2022 6:51 PM | Last Updated on Thu, Sep 1 2022 6:53 PM

Naa Venta Padutunna Chinnadevadamma Movie Gets Postponed - Sakshi

షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించిన తేజ్ కూర‌పాటి సోలో హీరోగా , అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం  “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంక‌ట్ వందెల దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్స్ కొరత కారణంగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు మూవీ టీం ప్రకటించింది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement