Naa Venta Paduthunna Chinnadevadamma Movie
-
‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ మూవీ రివ్యూ
టైటిల్: నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా నటీనటులు: తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ , తణికెళ్ళ భరణి, కల్పనా రెడ్డి, జీవా, జొగి బ్రదర్స్, అనంత్, బస్టాప్ కోటేశ్వరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు నిర్మాతలు: ముల్లేటి కమలాక్షి, గుబ్బుల వెంకటేశ్వరావు దర్శకత్వం: వెంకట్ వందెల సంగీతం: సందీప్ కుమార్ సినిమాటోగ్రఫీ : పి.వంశిప్రకాశ్ ఎడిటర్: నందమూరి హరి విడుదల తేది: అక్టోబర్ 14, 2022 కథేంటంటే.. పశ్చిమ గోదావరి జిల్లా రావులపాలెం ప్రెసిడెంట్ కొడుకు రాధ(తేజ్ కూరపాటి)కి, జువ్వాలపాలెం ప్రెసిడెంట్ కూతురు కృష్ణ(అఖిల ఆకర్షణ) మధ్య ఎలాంటి పరిచయం ఉండదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని పుకార్లు పుట్టిస్తారు జోగీబ్రదర్స్. ఆ రెండు ఊర్లకు వైరం పెట్టించడం కోసమే జోగీ బ్రదర్స్ ఈ పుకారును సృష్టిస్తారు. ప్రజలు కూడా నిజంగానే రాధ,కృష్ణ మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని నమ్ముతారు. ఈ విషయం రాధ వరకు చేరడంతో..అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. కృష్ణని చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు రాధ. ఆమెకు తెలికుండా రోజూ ఫాలో అవుతుంటాడు. ఒక అబ్బాయి తన వెంట పడుతున్నాడనే విషయం కృష్ణకు తప్ప ఊర్లో వాళ్లందరికి తెలుస్తుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఇద్దరు పారిపోయి తిరుపతి వెళ్తారు. అనుకోకుండా ఒకే బస్‌లో తిరుపతికి వెళ్లిన వీరిద్దరికి కాలేజీ చైర్మన్ అరుణ్ గోకలే (తణికెళ్ళ భరణి) వీరికి సెల్టర్ ఇచ్చి కాలేజ్ జాయిన్ చేసుకుంటాడు. అక్కడ రూమ్స్ లేని కారణంగా ఇద్దరికి ఒకే గది ఇస్తాడు. అయితే కృష్ణ మాత్రం రాధతో ఉండేందుకు నిరాకరిస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ వచ్చి రాధ గురించి తనకు బాగా తెలుసని, అతను గే అని, టెన్షన్ పడాల్సిందేమి లేదని చెబుతాడు. దీంతో అతనితో కలిసి ఒకే గదిలో ఉంటుంది కృష్ణ. దాని వల్ల కృష్ణ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ప్రిన్సిపల్ చెప్పినట్లు రాధ నిజంగానే ‘గే’నా? పారిపోయిన పిల్లల కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు వీరిద్దరు హత్య చేయబడ్డారనే వార్త తెలుస్తుంది. అందులో నిజమెంత? అసలు వీరిద్దరినీ మర్డర్ చేసే బలమైన కారణం ఏంటి? చివరకు రాధ, కృష్ణలు ఒక్కటయ్యారా?లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చూశారంటే.. హుషారు, షికారు, రౌడీ బాయ్స్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో తేజ్ కూరపాటి. సోలో హీరోగానూ రాణిస్తున్నాడు. రాధ పాత్రకి న్యాయం చేశాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ని తెరపై చక్కగా వ్యక్త పరిచాడు. హీరోయిన్ గా నటించిన అఖిల ఆకర్షణ కు మొదటి చిత్రమైనా ఆకట్టుకుంది.ఇందులో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ మన పక్కింటి అమ్మాయి, అబ్బాయి లాగా చాలా చక్కగా నటించారు. కాలేజీ చైర్మన్ అరుణ్ గోకలే గా తణికెళ్ల భరణి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. పోలీసు అధికారిగా జీవా, రాధ తల్లి తండ్రులుగా డాక్టర్ ప్రసాద్, సునీత మనోహర్ లు, కృష్ణ తల్లితండ్రులుగా బస్టాప్ కోటేశ్వరావు, మాధవి ప్రసాద్ లు, చాలా బాగా నటించారు. జోగీ బ్రదర్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. పల్లెటూరి నేపధ్యంలో సాగే చక్కటి ప్రేమ కథే ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ఓ మంచి లవ్‌స్టోరీకి కామెడీ మిక్స్ చేసి యూత్‌ని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ వందెల. పాత కథే అయితే కథనం మాత్రం ఫ్రెష్‌గా ఉంది. హీరోయిన్‌కి తెలియకుండా హీరో ఫాలో అవడం.. ఆ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు తిట్టడం. ఇద్దరి కలిసి ఒకే బస్‌లో తిరుపతి వెళ్లడం ఇలా ఫస్టాఫ్ సింపుల్‌గా సాగుతుంది. ఒక సెకండాఫ్‌లో మాత్రం కామెడీ వర్కౌట్ అయింది. హీరో గే అని చెప్పిన తర్వాత వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తుంది. తణికెళ్ల భరణి పాత్ర సినిమాకు చాలా ప్లస్ అయింది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఓ స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమను చూపించాడు దర్శకుడు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సందీప్ కుమార్ సంగీతం బాగుంది. ‘పుడిమిని తడిపే తొలకరి మెరుపుల చినుకమ్మా’పాట అందరిని ఆకట్టుకుంటుంది. వంశీ ప్రకాశ్ సినిమాటోగ్రఫీ,నందమూరి హరి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'
తేజ్ కూరపాటి, అఖిల జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా'. వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరావు, ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీని ఈనెల 14న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుందని చిత్రబృందం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల, యం.ఆర్.సి. వడ్ల పట్ల , నిర్మాతలు సి.హెచ్వీ.యస్.యన్ బాబ్జీ, కాసుల రామకృష్ణ, రవీంద్ర గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి మెహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. 'ఇంతకుముందు ముల్లేటి నాగేశ్వరావు చాలా మంచి సినిమాలు తీశారు. 15 ఏళ్ల గ్యాప్ తరువాత నిర్మించిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఈ నెల 14న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. యం.ఆర్.సి. వడ్లపట్ల చౌదరి మాట్లాడుతూ.. 'ముల్లేటి వారు సినిమాను ఒక తపస్సులా భావించి చాలా కష్టపడి తీశారు. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీశారు.ఈ సినిమా తరువాత ముల్లేటి ఫ్యామిలీతో మరో సినిమా తీస్తున్నాం. ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. 'మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో పల్లెటూరి నేపధ్యంలో సాగే చక్కటి ప్రేమకథలో యూత్‌కు కావాల్సిన వినొదాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తేజ్ కూరపాటి ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. హీరోయిన్‌కు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించింది. మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.' అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ..'మంచి కంటెంట్‌తో రెగ్యులర్ స్టోరీకు భిన్నంగా వస్తున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది.ప్రతి ఒక్కరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సరైన థియేటర్స్ దొరకనందున మేము సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చాం. చివరకు మాకు అనుకున్న థియేటర్స్ లభించడంతో ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నాం. అందరూ మా సినిమాను అశీర్వదించాలని కోరుతున్' అని అన్నారు. -
థియేటర్లు దొరక్క “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా” సినిమా వాయిదా
షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించిన తేజ్ కూరపాటి సోలో హీరోగా , అఖిల ఆకర్షణ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం “నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా”. రాజధాని ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారధ్యం లో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ వందెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్స్ కొరత కారణంగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు మూవీ టీం ప్రకటించింది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. -
‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ బిగ్ హిట్ కావాలి’
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ..‘అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి .ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి’ అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘వరుస అపజయాలతో నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీ కి ఊపిరి నింపాయి.మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ తో చిన్న సినిమా గా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారేలా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకొన్నాడు .ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి ’అన్నారు. చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ.. ఒక్క సినిమా చేయడం ఎంత కష్టమో ఈ చిత్రం ద్వారా తెలిసింది. ఒక్క మూవీ కోసం ఒక లైట్ బాయ్ దగ్గరనుండి నటీ నటులు, టెక్నిషియన్స్ వరకు ఎంతో మంది కష్టపడతారు. ఇలా వీరందరూ కలిస్తేనే ఒక సినిమాగా బయటకు వస్తుంది. అలాంటి సినిమాను అవమానంగా చూడద్దు అని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. మా సినిమాను మనస్ఫూర్తిగా ఆశీర్వాదించాలని ప్రేక్షకులను కోరకుంటున్నాను’అని అన్నారు. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేస్తున్న ఈ సినిమాను పవన్ ఫ్యాన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు తనను ఆశ్వీర్వదించి, సినిమాను ఆదరించాలని హీరోల తేజ్ కురపాటి అన్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు . -
ఆకట్టుకుంటున్న 'ఏకాంత సమయం' వీడియో సాంగ్
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై పాటలకు మంచి స్పందల లభించింది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మరో పాటని విడుదల చేశారు మేకర్స్. . డా భవ్య దీప్తి రెడ్డి రచించిన 'ఏకాంత సమయం' అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. సాంగ్ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత ముల్లేటి కమలాక్షి మాట్లాడుతూ..ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము..ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గార్ల తో పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..‘ ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి. ప్రేమకథ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెరక్కించామ’ని దర్శకుడు వెంకట్ వందెల అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు మాట్లాడుత..‘దర్శకుడు వెంకట్ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. డా భవ్య దీప్తి రెడ్డి ఈ సినిమాకు చక్కటి ఐదు పాటలు రాయడం జరిగింది. సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయి.ఈ సినిమాలో నటించిన నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది’అన్నారు.