Actor Srikanth Launched Ekantha Samayam Song From Naa Venta Paduthunna Chinnadevadamma - Sakshi
Sakshi News home page

Srikanth: శ్రీకాంత్‌ చేతుల మీదుగా 'ఏకాంత సమయం' వీడియో సాంగ్‌

Published Sat, Aug 27 2022 1:32 PM | Last Updated on Sat, Aug 27 2022 3:28 PM

Srikanth Launched Ekantha Samayam Song From Naa Venta Paduthunna Chinnadevadamma - Sakshi

తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై పాటలకు మంచి స్పందల లభించింది. తాజాగా హీరో శ్రీకాంత్‌ చేతుల మీదుగా మరో పాటని విడుదల చేశారు మేకర్స్‌. . డా భవ్య దీప్తి రెడ్డి రచించిన 'ఏకాంత సమయం' అంటూ సాగే ఈ రొమాంటిక్‌ సాంగ్‌ ఆకట్టుకునేలా ఉంది.

సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా చిత్ర నిర్మాత  ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ..ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము..ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గార్ల తో  పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..‘ ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి.  ప్రేమక‌థ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెర‌క్కించామ’ని దర్శకుడు వెంకట్‌ వందెల అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుత..‘దర్శకుడు వెంకట్ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. డా భవ్య దీప్తి రెడ్డి ఈ సినిమాకు చక్కటి ఐదు పాటలు రాయడం జరిగింది. సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్  ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయి.ఈ సినిమాలో నటించిన నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది’అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement