బహుమతి లాంటి సినిమా: హీరోయిన్ అనుపమ | Anupama Parameswaran and Dhruv Vikram to Play Leads in Mari Selvaraj Tamil Sports Drama | Sakshi
Sakshi News home page

బహుమతి లాంటి సినిమా: హీరోయిన్ అనుపమ

Published Wed, Mar 13 2024 3:23 AM | Last Updated on Wed, Mar 13 2024 10:20 AM

Anupama Parameswaran and Dhruv Vikram to Play Leads in Mari Selvaraj Tamil Sports Drama - Sakshi

విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ జోడీగా నటించనున్నారు. ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో ధృవ్‌కు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ నటించనున్నట్లు మంగళవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మారి సెల్వరాజ్‌ దర్శకుడు. రజనీకాంత్‌తో ‘కాలా’, ‘కబాలి’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు పా. రంజిత్‌ ఈ సినిమాకు ఓ నిర్మాత.

ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘‘నా కెరీర్‌కు ఓ మంచి బహుమతిలా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనుపమా పరమేశ్వరన్‌. ‘‘కబడ్డీ ఆట మూలాలను తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. మా టీమ్‌ సభ్యుల కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా ఈ చిత్రం ఉంటుంది’’ అని మారి సెల్వరాజ్‌ పేర్కొన్నారు. కబడ్డీ ప్లేయర్‌ మానతీ గణేశన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement