కుమారుడు ధృవ్‌తో విక్రమ్
ప్రముఖులు తమ వారసులను పరిచయం చేయడం అనేది అన్ని రంగాల్లోనూ జరుగుతోంది. సినిమా రంగం ఇందుకు అతీతం కాదు. ఎందరో నటీనటులు తమ వారసులను పరిచయం చేశారు, చేస్తున్నారు కూడా. అలా ప్రముఖ నటుడు సియాన్ విక్రమ్ కూడా తన వారసుడు ధృవ్ విక్రమ్‌ను కథానాయకుడిగా పరిచయం చేశారు. సాధారణంగా తమ వారసులని పరిచయం చేసే ముందు ఆ చిత్రానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా కథ విషయంలో ప్రత్యేక దృష్టి పెడతారు. అదేవిధంగా నటుడు విక్రమ్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని తెలుగులో సంచల విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్ర తమిళ్ రీమేక్ ద్వారా తన కొడుకు ధృవ్‌విక్రమ్‌ను కథానాయకుడిగా పరిచయం చేశారు.
అనుకున్నవన్నీ జరగవు కదా! అలా ధృవ్ విక్రమ్ తొలిసారిగా నటించిన ఆదిత్య వర్మ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. నటుడిగా ధృవ్ విక్రమ్ మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. చిత్రం విజయవంతమైతే నటికైనా నటుడి కైనా క్రేజ్ వస్తుంది. అలా తన కొడుకును హీరోగా నిలనెట్టడానికి మిత్రమా విక్రమ్ మలి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఈయన కూడా తన కొడుకుతో కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. దీన్ని సక్సెస్ ఫుల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారు. ప్రముఖ నిర్మాత లలిత్‌కుమార్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. (కల నిజమైంది)
విశేషమేమిటంటే ఈ చిత్రంలో యువ నటుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో విక్రమ్ పాత్ర ఏమిటన్నది ఆసక్తిగా మారింది. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా నటించడం విక్రమ్‌కు కొత్తేమీ కాదు. ఇంతముందు కూడా ఇరుముగన్ చిత్రంలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా తన కొడుకును హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి మరోసారి విలన్గా మారడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment