జోడీ కుదిరిందా? | Dhruv next movie with Priya Prakash Varrier | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Published Tue, Sep 1 2020 3:06 AM | Last Updated on Tue, Sep 1 2020 3:06 AM

Dhruv next movie with Priya Prakash Varrier - Sakshi

ధృవ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌

తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం తమిళ రీమేక్‌తో హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ తమిళంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ శిష్యుడు రవికాంత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధృవ్‌. ఈ  సినిమాలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికగా ఎంపికైందని టాక్‌.

‘ఒరు అడార్‌ లవ్‌’ చిత్రంలో కన్ను గీటి యువకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ మధ్య వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ కేరళ కుట్టి జోరుకి ఈ మధ్య కాస్త బ్రేకులు పడ్డాయని మాలీవుడ్‌ టాక్‌. దాంతో ధృవ్‌ సినిమాలో సోలో హీరోయిన్‌గా అవకాశం రావడంతో ఈ బ్యూటీ ఫుల్‌ ఖుషీ అవుతున్నారట. కాగా నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలోనూ ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి రెండో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement