
మేఘా చౌదరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా! ఏది అనుకోనమ్మా నీ చిరునామా! ఇదిగో ఆల్మోస్ట్ ఇలాగే విక్రమ్ తనయుడు ధృవ్ సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రియురాలి కోసం ఇన్నాళ్లు పాడుకుని ఉంటారేమో. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే అతనికి ప్రేయసి దొరికేసింది. రీల్ లవర్ గురించి చెబుతున్నాం. బాల దర్శకత్వంలో ధృవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో షాలినీ పాండే కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తమిళ చిత్రానికి హీరోయిన్‌గా చాలా మంది పేర్లను పరిశీలించారు. రీసెంట్‌గా శ్రియా శర్మ పేరు వినిపించింది. ఫైనల్లీ బెంగాలీ మోడల్ మేఘా చౌదరిని కన్ఫార్మ్ చేశారు. సో.. వర్మకి లవర్ దొరికిందన్న మాట. ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment