Arjunreddy Movie
-
హీరోయిన్లను అలా ఎందుకు చూపించానంటే: సందీప్‌రెడ్డి వంగా
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాను తెరికెక్కించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి సందీప్‌రెడ్డి వంగా తెలిపాడు. ఇందులో రష్మిక మందన్నా నటనకు పాన్ ఇండియా ఫిదా అయింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 900 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరగా ఉంది. సినిమా విడుదల సమయంలో ఈ మూవీపై విమర్శలు ఎన్ని ఉన్నా కలెక్షన్స్ సునామీ మాత్రం తగ్గలేదు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అని చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినా కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో హిట్ కొట్టిన సందీప్.. 'యానిమల్' సినిమాతో కెరీర్లో మరో హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్‌రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. తన సినిమాల్లో హీరోలను పెద్ద ఘనత సాధించిన వారిలా చూపించి.. మహిళలను మాత్రం ఇంటికే ఎందుకు పరిమితం చేస్తారు..? అనే ప్రశ్న సందీప్‌కు ఎదురైంది. దీంతో ఆయన 'ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే అందరూ ఉద్యోగం చేయడమో, బిజినెస్ చేయడమో, పోరాట యోధురాలిగా చేయడమో, టీచర్లను చూపిండమో చేస్తారు. కానీ వారందరూ కూడా హౌస్ వైఫ్‌ను ఉమెన్ ఎంపవర్మెంట్గా మాత్రం గుర్తించరు. కానీ, నా దృష్టిలో వాటి అన్నింటితో పోలిస్తే అదే అతిపెద్ద ఉద్యోగం. ఇంట్లో ఉంటూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడంలో తల్లి పాత్ర ఎంతో పెద్దది. కొందరు నిజ జీవితంలో ఉద్యోగాలు చేస్తూనే తల్లి పాత్ర కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా పోషిస్తారు. వారు ఇంకా గొప్పవారు.' అని జవాబిచ్చారు. -
సినిమా కోసం తాగాల్సి వచ్చింది
‘‘కబీర్ సింగ్ పాత్ర కోసం రోజుకు ఇరవై సిగరెట్లు వరకూ తాగేవాణ్ణి. ఆ దుర్వాసన అంతా పోవడానికి సుమారు రెండు గంటలు స్నానానికి కేటాయించేవాడ్ని’’ అని తెలిపారు షాహిద్ కపూర్. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు షాహిద్ కపూర్. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌కి కూడా దర్శకుడు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాలో ప్రేయసి దూరమైన తర్వాత మందు, సిగరెట్లకు బానిస అయిన ప్రేమికుడిగా కనిపిస్తారు షాహిద్. కబీర్ సింగ్ పాత్ర గురించి షాహిద్ మాట్లాడుతూ – ‘‘రీమేక్ చేయడం చాలా కష్టం. ఒరిజినల్ని కాపీ చేస్తే కుదరదు. ఇక్కడి (నార్త్) ప్రేక్షకులకు సూట్ అయ్యేలా చేశాం. వ్యక్తిగతంగా పొగ త్రాగడాన్ని నేను అసలు ప్రోత్సహించను. కానీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అలా ఉంది. తన బాధను, కోపాన్ని వ్యక్తపరచలేక వాటికి బానిస అవుతాడు. ఆ పాత్ర కోసం రోజుకు 20 సిగరెట్లు వరకూ తాగాను. ఇంటికి వెళ్తే పిల్లలుంటారు కాబట్టి ఆ వాసన పోవడం కోసం 2 గంటలు షవర్ చేసి ఇంటికి వెళ్లేవాడ్ని’’ అని పేర్కొన్నారు. ‘కబీర్ సింగ్’ చిత్రం జూన్ 21న రిలీజ్ కానుంది. -
వర్మకి లవర్ దొరికింది
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా! ఏది అనుకోనమ్మా నీ చిరునామా! ఇదిగో ఆల్మోస్ట్ ఇలాగే విక్రమ్ తనయుడు ధృవ్ సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రియురాలి కోసం ఇన్నాళ్లు పాడుకుని ఉంటారేమో. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే అతనికి ప్రేయసి దొరికేసింది. రీల్ లవర్ గురించి చెబుతున్నాం. బాల దర్శకత్వంలో ధృవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో షాలినీ పాండే కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. తమిళ చిత్రానికి హీరోయిన్గా చాలా మంది పేర్లను పరిశీలించారు. రీసెంట్గా శ్రియా శర్మ పేరు వినిపించింది. ఫైనల్లీ బెంగాలీ మోడల్ మేఘా చౌదరిని కన్ఫార్మ్ చేశారు. సో.. వర్మకి లవర్ దొరికిందన్న మాట. ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. -
షాహిద్ ఈజ్ అర్జున్ రెడ్డి
‘రణ్వీర్ సింగ్ చేస్తాడు. లేదు.. లేదు.. అర్జున్ కపూర్ చేస్తాడు’ అంటూ తెలుగు సూపర్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్లో రీమేక్‌లో అవుతుందని తెలిసినప్పటి నుంచి పలువురి హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఫైనల్‌గా బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ దొరికేశాడు. హిందీ రీమేక్‌లో అర్జున్ రెడ్డి పాత్రలో షాహిద్ కపూర్ కనిపించనున్నారు. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ రీమేక్‌నూ డైరెక్ట్ చేయనున్నారు. జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను మురాద్ ఖేతానీ, అశ్విన్ వార్దే నిర్మించనున్నారు. ‘‘కాలేజ్ పోర్షన్‌ను ఢిల్లీలో షూట్ చేయనున్నాం. బాలీవుడ్లో ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది. ఈ కథను ఇంకా ‘రా’గా చూపించే ప్రయత్నం చేస్తాను. షాహిద్ కపూర్ చాలా టాలెంటెడ్ యాక్టర్. అర్జున్ రెడ్డి క్యారెక్టర్‌ను బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించేలా చేస్తాడనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాకు సంబంధించి మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. 2019 మార్చి 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నెక్ట్స్ మహేశ్‌తో.. డైరెక్టర్ సందీప్ వంగా బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కంప్లీట్ చేయగానే మహేశ్‌బాబుతో ఓ సినిమా ఉంటుందని సమాచారం. ఆల్రెడీ మహేశ్‌బాబు కథ వినేసి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. మహేశ్ 27వ సినిమాగా రూపొందే అవకాశం ఉందట. బహుశా హిందీ రీమేక్ తర్వాత సందీప్ చేయబోయేది ఈ ప్రాజెక్టే అవుతుందేమో?. హిందీ ‘అర్జున్ రెడ్డి’ వచ్చే ఫిబ్రవరిలో పూర్తి అవుతుంది. ఆ తర్వాత మహేశ్‌బాబు–సందీప్ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు. -
అర్జున్‌రెడ్డి దర్శకుడి నెక్ట్స్ సినిమా ఇదేనా?
సాక్షి, సినిమా : తొలి సినిమాలోనే మాస్, లవ్, రొమాన్స్, యాక్షన్ వంటి వివిధ కోణాలను చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా. అర్జున్‌రెడ్డి లాంటి విభిన్న చిత్రంతో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ దర్శకుడు చేయబోయే సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడితో సినిమా తీయాలని నిర్మాతలు, హీరోలు ఎదురు చూస్తున్నారు. కానీ అర్జున్ రెడ్డి తరువాత ఇప్పటివరకు సందీప్ ఏ ప్రాజెక్టును ఫైనల్ చేయలేదు. ఈ మధ్యే సందీప్‌రెడ్డి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటికి వెళ్లి ఓ కథ వినిపించాడని, ఆ కథ మహేష్‌కు నచ్చిందని, వంశీ పైడిపల్లి సినిమా అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని టాలీవుడ్లో వార్తలు వినపిస్తున్నాయి. అంతేకాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ ఓ సినిమా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో సినిమాను ప్రారంభించిన చరణ్ ఆ తరువాత రాజమౌళి మల్టీ స్టారర్లో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రంగస్థలం సక్సెస్ మీట్లో సందీప్ రెడ్డి పాల్గొనటంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. మరి ఈ ఉత్కంఠకు తెర దించుతూ సందీప్.. ఏ సినిమా ను అధికారికంగా ప్రకటిస్తాడో వేచి చూడాలి. -
బాలా చేతిలో మరో వారసురాలు
దర్శకుడు బాలా మరో నట వారసురాలిని నటిగా మలచనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులు వస్తోంది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు బాలా. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్ ఇలా ఒకదానికొక్కటి సంబంధం లేని కథా చిత్రాల సృష్టి కర్త బాలా. ఇటీవల జ్యోతిక, జీవీ ప్రకాశ్కుమార్లు నటించిన నాచియార్ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు విక్రమ్ కొడుకు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది కూడా. అయితే ఇందులో నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో ఈ పాత్ర పోషించిన మరాఠీ భామ శాలినిపాండే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌కు బాలా వర్మ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో శాలినిపాండే పాత్రలో చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంలో బాల నటిగా నటించిన శ్రియశర్మను నటింపజేయడానికి చర్చలు జరిగాయి. ఆ తరువాత తెలుగులో నటించిన శాలినిపాండేనే తమిళంలోనూ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మీని బాలా కథానాయకిగా పరిచయం చేయనున్నారన్నదే ఆ న్యూస్. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వర్మ చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ధృవ్తోపాటు సుబ్బులక్ష్మీ పాల్గొనే అవకాశం ఉంది. -
ఎస్ఆర్ఎం వర్సిటీలో సాంస్కృతికోత్సవాలు
చెన్నై: నగరంలోని ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో మిలన్–2018 పేరుతో సాంస్కృతికోత్సవాలు బుధవారం ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ కార్యక్రమానికి అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండతోపాటు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చాన్స్‌లర్ టీఆర్ పారివేందర్, వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ తదితరులు హాజరయ్యారు. మొత్తం ఐదు రోజులపాటు సాంస్కృతికోత్సవాలు జరగనుండగా తొలిరోజు దాదాపు 6,000 మంది వచ్చారనీ, వేడుకల్లో పాల్గొనేందుకు ఐదు ఖండాల్లోని 40 దేశాల నుంచి విద్యారంగ ప్రముఖులు ఇక్కడకు రానున్నారని నిర్వాహకులు తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి మొత్తంగా రూ.15 లక్షల నగదును ఇవ్వనున్నట్లు చెప్పారు. -
వారికి బానిసైపోయా!
తమిళసినిమా: నేను దానికి బానిసనైపోయానంటోంది నటి శాలినిపాండే. టాలీవుడ్లో ఒకే ఒక్క చిత్రం ఈ అమ్మడిని పిచ్చ పాపులర్ చేసేసింది. అదే తనను కోలీవుడ్ వరకూ తీసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే వరుసగా మూడు చిత్రాలను చేసేస్తోంది. యమ కిక్ ఇచ్చే లక్ అంటే ఇదే మరి. తెలుగులో సంచలన విజయం సాధించిన 100% లవ్ చిత్ర తమిళ రీమేక్ ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న ఈ స్టేజీ ఆర్టిస్ట్ ఈ చిత్ర విడుదల కాకుండానే జీవాకు జంటగా గొరిల్లా, చిత్రంతో పాటు తెలుగు, తమిళం భాషల్లో నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న మహానది చిత్రంలోనూ నటిస్తున్నారు. మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించే విషయమై ఒప్పందాలు కుదుర్చుకున్న శాలినిపాండే మాట్లాడుతూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యానని చెప్పింది. అందులో ప్రీతి పాత్రలో లీనమై నటించానని, ఆ పాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా ప్రీతి అంటూ పిలుస్తున్నారని అంది. అలాంటిప్పుడు తాను చాలా భావోద్రేకాలకు గురవుతానని చెప్పింది. అలా వారి అభిమానానికి తాను బానిసనైపోయానని చెప్పింది. అయితే అర్జున్‌రెడ్డి చిత్రం తెచ్చి పెట్టిన పేరును తాను తలకెక్కించుకోలేదని, ఎప్పటిలానే ఉన్నానని పేర్కొంది. అయితే ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందినట్లు కోలీవుడ్ ప్రేక్షకుల మనసులను మంచి పాత్రలతో గెలుచుకోవాలని ఆశ పడుతున్నానని శాలినిపాండే అంటోంది. -
కౌన్ హై అర్జున్ రెడ్డి?
‘అర్జున్ రెడ్డి తెలుగులో విజయ్ దేవరకొండ. తమిళ రీమేక్ ‘వర్మ’ ధ్రువ్ విక్రమ్. మరి.. హిందీ రీమేక్ పేరేంటి? కౌన్ హై అర్జున్ రెడ్డి (అర్జున్ రెడ్డి ఎవరూ అంటే?) ప్రస్తుతం క్లారిటీ లేని టాపిక్. తొలుత రణ్వీర్ సింగ్ చేస్తాడు అన్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిగా షాహిద్ కపూర్ కనిపిస్తాడని అనుకున్నారు. కానీ ఈ లిస్ట్‌లోకి తాజాగా అర్జున్ కపూర్ పేరు వచ్చి చేరింది. అర్జున్ రెడ్డి పాత్రను అర్జున్ కపూర్ చేయబోతున్నారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ అర్జున్ రెడ్డిని కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తారట. ఈ రీమేక్‌ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్ సంస్థ నిర్మించనుంది. -
పోలీసులకు సారీ చెప్పిన అర్జున్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులకు అర్జున్ రెడ్డి సారీ చెప్పారు. అదేంటనుకుంటున్నారా ? అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఫుట్ బాల్ గేమ్ ఆడటానికి స్పోర్ట్స్ డ్రెస్‌లోనే హెల్మెట్ లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై స్మోక్ చేస్తూ వెళ్లే ఓ సీన్ మనందరికి గుర్తు ఉండే ఉంటుంది. అయితే హెల్మెట్ ప్రాధాన్యతను అందరికీ తెలియజేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే అర్జున్ రెడ్డి పోస్టర్లో విజయ్ దేవరకొండ హెల్మెట్ ధరించకుండా ఉన్న ఫోటోను, గ్రాఫిక్స్ సహాయంతో అదే ఫోటోకు హెల్మెట్ పెట్టారు. ట్రాఫిక్ నిబంధనల్లో ఏది సరైంది, ఏది తప్పు అనేది కూడా టిక్ పెట్టి ఓ ఫోటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్విట్ చేశారు. ప్రపంచంలో ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. వీరిలో దాదాపు సగం మంది ద్విచక్ర వాహనాలు నడిపేవారే. వీరిలోనూ తలకు బలమైన గాయాలు తగలడం వల్ల చనిపోయేవారి సంఖ్య మరీ ఎక్కువగా వున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అంటే స్కూటర్లు, బైక్ లు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం ఆయా కుటుంబాలను అంతులేని విషాదంలోకి ఈడ్చుకెళ్తోంది. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం అనే ఒకే ఒక్క పొరపాటు ప్రతి రోజూ కొన్ని వందల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది. దీంతో తలకు గాయాలవ్వడం వల్లే ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు మృతిచెందుతున్నారని ట్విట్టర్లో అర్జున్ రెడ్డి ఫోటోతో పాటూ పోస్ట్ చేశారు. దీనికి బదులుగా సారీ మామా.. ఇప్పటి నుంచి పక్కా అంటూ విజయ్ దేవరకొండ ఓ ట్విట్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అంటూ తమఫాలోవర్లకు అర్జున్ రెడ్డి చిత్రంలోని మరో ఫోటో ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇందులో అర్జున్ రెడ్డి, చిత్రంలోని మరో పాత్ర అమిత్ సహాయంతో ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అంటూ మరో ట్విట్ చేశారు. Most common cause of death is HEAD INJURY. Admin H! pic.twitter.com/9H2ShAosnW — HYDTP (@HYDTP) January 19, 2018 Don't be like Amith. Be like Arjun Reddy. Admin H ! pic.twitter.com/MawZQn2b89 — HYDTP (@HYDTP) January 21, 2018 Sorry Mama :) Ippati nunchi pakka. https://t.co/zGdFHM1zQU — Vijay Deverakonda (@TheDeverakonda) January 19, 2018 -
ఇప్పుడు క్రైమ్!
ఫుల్‌గా లవ్ చేసింది. అర్జున్ రెడ్డిని పీకల్లోతు ప్రేమించింది. ఇప్పుడు జీవీ ప్రకాశ్కుమార్ని ఫుల్‌గా లవ్ చేస్తోంది. అవును మరి.. తెలుగులో షాలినీపాండే ఫస్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ లవ్‌స్టోరీ అని తెలిసిందే. ఇప్పుడు తమిళంలో చేస్తోన్న ‘100% లవ్’ రీమేక్ కూడా లవ్‌స్టోరీయే. ఇందులో జీవీ ప్రకాశ్‌కుమార్ సరసన నటిస్తోంది షాలిని. ఇప్పుడు షాలిని క్రైమ్ వైపు టర్న్ తీసుకుందని కోలీవుడ్ సమాచారం. జీవా∙హీరోగా డాన్ సాండీ దర్శకత్వంలో విజయేంద్ర వర్మ నిర్మాణంలో తమిళంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో షాలినీపాండేని కథానాయికగా ఎంపిక చేశారు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా అన్నది కోలీవుడ్ టాక్. ‘‘మా సినిమాలో బిగ్ సర్ప్రైజ్ ఉంది. అదేంటనేది ఇప్పుడే చెప్పను. జనవరిలో షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘ స్క్రిప్ట్‌లో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆధారంగా జీవాను తీసుకున్నాం. ఫ్రెష్ అండ్ యంగ్ టాలెంట్ ఉన్న అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని షాలినీ పాండేని ఎంపిక చేశాం’’ అన్నారు నిర్మాత. -
అవకాశాల బాటలో అర్జున్‌రెడ్డి హీరోయిన్
సాక్షి, సినిమా: టాలీవుడ్లో తొలి సినిమా అర్జున్‌రెడ్డితోనే సంచలన విజయాన్ని అందుకున్న జైపూర్ బ్యూటీ శాలినిపాండే. ఆ సినిమా విజయం ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేసేసింది. తెలుగులో ఘనవిజయం సాధించిన 100 % లవ్ రీమేక్ ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శాలినిపాండే ఈ చిత్రంలో జీవీ. ప్రకాశ్‌కుమార్‌తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం నటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. అదే విధంగా మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో మూడో చిత్రానికి రెడీ అవుతోంది. ఇందులో నటుడు జీవాకు జంటగా నటించనుంది. ఇది జీవీకు 29వ చిత్రం. దీనికి డాన్ శాండి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆల్ ఇన్ ఫిక్చర్స్ పతాకంపై విజయ రాఘవేంద్ర భారీ బడ్జెట్లో నిర్మించనున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నటుడు జీవా ఇప్పటి వరకూ నటించనటువంటి వైవిధ్యంతో కూడిన కామెడీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా శాలినిపాండే పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. విక్రమ్‌వేదా చిత్రం ఫేమ్ శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద నటి శాలినిపాండే కోలీవుడ్‌లో మూడో చిత్రానికి సిద్ధం అయిపోతోంది. -
మన అర్జున్రెడ్డియే... వర్మగా మారాడు!
అదెలా కుదురుంది? ఎక్కడైనా ఒక్కటే పేరు ఉంటుంది కదా! మరి, ‘అర్జున్‌రెడ్డి’ వర్మగా ఎలా మారాడు? అనుకోవద్దు! రీమేక్ సినిమాల్లో హీరోలు మారినప్పుడు, టైటిల్స్ కూడా మారతాయి కదా! విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ హిట్. ఆ టైటిలే ఓ ట్రేడ్ మార్క్ సింబల్‌గా మారింది. ఈ సినిమాను తమిళంలో ప్రముఖ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు బాల దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రీమేక్‌కి ‘వర్మ’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ధృవ్ క్యారెక్టర్‌కి తగ్గట్టు లుక్‌ని మార్చుకునే పనిలో ఉన్నారట! వన్స్... లుక్ ఫైనలైజ్ చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారట! విక్రమ్‌ని ‘సేతు’తో స్టార్ చేసిన దర్శకుడు బాలాయే. ఆయన ధృవ్‌కి ఎలాంటి హిట్ ఇస్తారోనని విక్రమ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
అర్జున్ కాదలి యార్?
... అర్జున్ కాదలి యార్? ఇప్పుడు తమిళ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. కాదలి అంటే ప్రేయసి. యార్ అంటే ఎవరు అని అర్థం. అర్జున్‌రెడ్డిగా విజయ్ దేవరకొండ, ప్రీతీగా షాలినీ పాండే నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సెన్సేషనల్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్ ద్వారా హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కానున్నారు. ఇందులో అక్షరా హాసన్ లేదా శ్రియా శర్మను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నారట. అక్షరాహాసన్ అంటే కమల్‌హాసన్ చిన్న కూతురనీ, హీరోయిన్ శ్రుతీహాసన్ చెల్లెలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శ్రియా శర్మ ఎవరంటే.. 12 ఏళ్ల క్రితం వచ్చిన ‘జై చిరంజీవ’లో చిరంజీవి మేనకోడలు లావణ్య పాత్రలో శ్రియా శర్మ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. గతేడాది వచ్చిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో శ్రియా శర్మనే కథానాయిక. అలా చైల్డ్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి హీరోయిన్ వరకు చేరుకున్నారామె. మరి... చిరంజీవి రీల్ లైఫ్ మేనకోడలా? కమల్‌హాసన్ రియల్ డాటరా? ఈ ఇద్దరూ కాకుండా ‘అర్జున్‌రెడ్డి’తో లవ్‌లో పడేది ఎవరు? వెయిట్ అండ్ సీ. అన్నట్లు... తెలుగులో కాబట్టి ‘అర్జున్‌రెడ్డి’ అని పెట్టారు... మరి తమిళంలో? ‘అర్జున్ గౌండర్’ అనీ, ‘అర్జున్ ముదలియార్’ అనీ.. ఇలా అక్కడికి తగ్గట్టు టైటిల్ పెడతారేమో? లేక అర్జున్ కాకుండా వేరే పేరేమైనా పెడతారేమో? -
'అర్జున్ రెడ్డి'కి కేటీఆర్ ఫిదా..
వివాదాలతో ప్రారంభమై భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీని సినీ, రాజకీయ ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ,నటి సమంతలతోపాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించగా తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ జాబితాలో చేరారు. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా ఇరగదీశాడని కితాబిచ్చారు. చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి, నిర్మాత ప్రణయ్ భాస్కర్లను ప్రత్యేకంగా అభినందించారు. సినిమాకు సంబంధించిన విషయాలను కొన్ని పదాలతో పొల్చుతూ ట్వీట్ చేశారు. ఇది మనసుకు హద్దుకునే ఒక నిజాయితీని ప్రతిబింబించే చిత్రమని అభివర్ణించారు. అంతేకాకుండా బోల్డ్‌గా తీసిన ఈ రిస్కీ చిత్రాన్నిఒరిజినల్ సినిమాగా తీయాలంటే ఎంతో దైర్యం ఉండాలని పేర్కొన్నారు.