బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' సినిమాను తెరికెక్కించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి సందీప్‌రెడ్డి వంగా తెలిపాడు. ఇందులో రష్మిక మందన్నా నటనకు పాన్ ఇండియా ఫిదా అయింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 900 కోట్ల కలెక్షన్స్ మార్క్‌కు దగ్గరగా ఉంది. సినిమా విడుదల సమయంలో ఈ మూవీపై విమర్శలు ఎన్ని ఉన్నా కలెక్షన్స్ సునామీ మాత్రం తగ్గలేదు. ఈ మూవీలో హింస ఎక్కువైందని.. మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే అసభ్య పదజాలం వాడారు అని చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినా కూడా ప్రేక్షకులను మెప్పించింది.
ఇప్పటికే బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌తో హిట్ కొట్టిన సందీప్.. 'యానిమల్' సినిమాతో కెరీర్లో మరో హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్‌రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. తన సినిమాల్లో హీరోలను పెద్ద ఘనత సాధించిన వారిలా చూపించి.. మహిళలను మాత్రం ఇంటికే ఎందుకు పరిమితం చేస్తారు..? అనే ప్రశ్న సందీప్‌కు ఎదురైంది.
దీంతో ఆయన 'ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే అందరూ ఉద్యోగం చేయడమో, బిజినెస్ చేయడమో, పోరాట యోధురాలిగా చేయడమో, టీచర్లను చూపిండమో చేస్తారు. కానీ వారందరూ కూడా హౌస్ వైఫ్‌ను ఉమెన్ ఎంపవర్మెంట్గా మాత్రం గుర్తించరు. కానీ, నా దృష్టిలో వాటి అన్నింటితో పోలిస్తే అదే అతిపెద్ద ఉద్యోగం. ఇంట్లో ఉంటూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడంలో తల్లి పాత్ర ఎంతో పెద్దది. కొందరు నిజ జీవితంలో ఉద్యోగాలు చేస్తూనే తల్లి పాత్ర కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా పోషిస్తారు. వారు ఇంకా గొప్పవారు.' అని జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment