
అర్జున్ కపూర్, సందీప్ రెడ్డి
‘అర్జున్ రెడ్డి తెలుగులో విజయ్ దేవరకొండ. తమిళ రీమేక్ ‘వర్మ’ ధ్రువ్ విక్రమ్. మరి.. హిందీ రీమేక్ పేరేంటి? కౌన్ హై అర్జున్ రెడ్డి (అర్జున్ రెడ్డి ఎవరూ అంటే?) ప్రస్తుతం క్లారిటీ లేని టాపిక్. తొలుత రణ్‌వీర్ సింగ్ చేస్తాడు అన్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిగా షాహిద్ కపూర్ కనిపిస్తాడని అనుకున్నారు. కానీ ఈ లిస్ట్‌లోకి తాజాగా అర్జున్ కపూర్ పేరు వచ్చి చేరింది. అర్జున్ రెడ్డి పాత్రను అర్జున్ కపూర్ చేయబోతున్నారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ అర్జున్ రెడ్డిని కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహిస్తారట. ఈ రీమేక్‌ను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ సంస్థ నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment