వారికి బానిసైపోయా! | 'Arjun Reddy' star Shalini Pandey to star with Nikhil Siddartha in 'Kanithan' remake | Sakshi
Sakshi News home page

వారికి బానిసైపోయా!

Published Sun, Feb 25 2018 4:54 AM | Last Updated on Sun, Feb 25 2018 4:54 AM

'Arjun Reddy' star Shalini Pandey to star with Nikhil Siddartha in 'Kanithan' remake - Sakshi

శాలినిపాండే

తమిళసినిమా: నేను దానికి బానిసనైపోయానంటోంది నటి శాలినిపాండే. టాలీవుడ్‌లో ఒకే ఒక్క చిత్రం ఈ అమ్మడిని పిచ్చ పాపులర్‌ చేసేసింది. అదే తనను కోలీవుడ్‌ వరకూ తీసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే వరుసగా మూడు చిత్రాలను చేసేస్తోంది. యమ కిక్‌ ఇచ్చే లక్‌ అంటే ఇదే మరి. తెలుగులో సంచలన విజయం సాధించిన 100% లవ్‌ చిత్ర తమిళ రీమేక్‌ ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్న ఈ స్టేజీ ఆర్టిస్ట్‌ ఈ చిత్ర విడుదల కాకుండానే జీవాకు జంటగా గొరిల్లా, చిత్రంతో పాటు తెలుగు, తమిళం భాషల్లో నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న మహానది చిత్రంలోనూ నటిస్తున్నారు.

మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించే విషయమై ఒప్పందాలు కుదుర్చుకున్న శాలినిపాండే మాట్లాడుతూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యానని చెప్పింది. అందులో ప్రీతి పాత్రలో లీనమై నటించానని, ఆ పాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా ప్రీతి అంటూ పిలుస్తున్నారని అంది. అలాంటిప్పుడు తాను చాలా భావోద్రేకాలకు గురవుతానని చెప్పింది. అలా వారి అభిమానానికి తాను బానిసనైపోయానని చెప్పింది. అయితే అర్జున్‌రెడ్డి చిత్రం తెచ్చి పెట్టిన పేరును తాను తలకెక్కించుకోలేదని, ఎప్పటిలానే ఉన్నానని పేర్కొంది. అయితే ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందినట్లు కోలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను మంచి పాత్రలతో గెలుచుకోవాలని ఆశ పడుతున్నానని శాలినిపాండే అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement