అర్జున్‌రెడ్డి దర్శకుడి నెక్ట్స్ సినిమా ఇదేనా? | Arjun Reddy Movie Director To Work With Mahesh Or Ramcharan | Sakshi
Sakshi News home page

అర్జున్‌రెడ్డి దర్శకుడి నెక్ట్స్ సినిమా ఇదేనా?

Published Wed, Apr 4 2018 11:19 AM | Last Updated on Wed, Apr 4 2018 11:19 AM

Arjun Reddy Movie Director To Work With Mahesh Or Ramcharan - Sakshi

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా

సాక్షి, సినిమా : తొలి సినిమాలోనే మాస్‌, లవ్‌, రొమాన్స్‌, యాక్షన్‌ వంటి వివిధ కోణాలను చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న క్రేజీ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా. అర్జున్‌రెడ్డి లాంటి విభిన్న చిత్రంతో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందారు. అర్జున్‌ రెడ్డి సినిమా తర్వాత ఈ దర్శకుడు చేయబోయే సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడితో సినిమా తీయాలని నిర్మాతలు, హీరోలు ఎదురు చూస్తున్నారు. కానీ అర్జున్‌ రెడ్డి తరువాత ఇప్పటివరకు సందీప్‌ ఏ ప్రాజెక్టును ఫైనల్‌ చేయలేదు.

ఈ మధ్యే సందీప్‌రెడ్డి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇంటికి వెళ్లి ఓ కథ వినిపించాడని, ఆ కథ మహేష్‌కు నచ‍్చిందని, వంశీ పైడిపల్లి సినిమా అనంతరం ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతుందని టాలీవుడ్‌లో వార్తలు వినపిస్తున్నాయి. అంతేకాకుండా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తోనూ  ఓ సినిమా ఫైనల్‌ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో సినిమాను ప్రారంభించిన చరణ్ ఆ తరువాత రాజమౌళి మల్టీ స్టారర్‌లో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రంగస్థలం సక్సెస్‌ మీట్‌లో సందీప్‌ రెడ్డి పాల్గొనటంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. మరి ఈ ఉత్కంఠకు తెర దించుతూ సందీప్‌.. ఏ సినిమా ను అధికారికంగా ప్రకటిస్తాడో వేచి చూడాలి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement