
కోలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విక్రమ్. ఆయన తనయుడు ధృవ్ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్ ‘వర్మ’తో ధృవ్ కోలీవుడ్‌కి హీరోగా పరిచయమవుతున్నారు. బాలా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో ధృవ్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో అని సమాచారం.
‘ఫిదా’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా తర్వాతి చిత్రంపై శేఖర్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ‘ఫిదా’ తర్వాత ఓ స్టార్ హీరోతో పనిచేయనున్నట్లు అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట.
Comments
Please login to add a commentAdd a comment