ధ్రువ్‌–తనీషా జోడీకి  మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌  | Odisha Masters 2023: Tanisha wins mixed doubles title with Dhruv | Sakshi
Sakshi News home page

Odisha Masters 2023: ధ్రువ్‌–తనీషా జోడీకి  మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ 

Published Mon, Dec 18 2023 7:10 AM | Last Updated on Mon, Dec 18 2023 7:10 AM

Odisha Masters 2023: Tanisha wins mixed doubles title with Dhruv - Sakshi

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్‌ లభించాయి. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో ద్వయం విజేతగా నిలువగా... పురుషుల సింగిల్స్‌లో సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ చాంపియన్‌ అయ్యాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ధ్రువ్‌–తనీషా జోడీ 74 నిమిషాల్లో17–21, 21–19, 23–21తో హీ యోంగ్‌ కాయ్‌ టెర్రీ–తాన్‌ వె హాన్‌ జెస్సికా (సింగపూర్‌) జంటను ఓడించింది. ధ్రువ్‌–తనీషా జోడీకి 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సతీశ్‌ 21–18, 19–21, 21–14తో ఆయుశ్‌ శెట్టి (భారత్‌)పై గెలిచాడు. సతీశ్‌కు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం 14–21, 17–21తో మెలీసా–రాచెల్‌ రోజ్‌ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్‌–సాయిప్రతీక్‌ (భారత్‌) జంట 20–22, 18–21, 17–21తో లిన్‌ బింగ్‌ వె–సు చింగ్‌ హెంగ్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement