
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు, ఆటో, ఇన్‌సెట్‌లో ధ్రువ్
సాక్షి, చెన్నై: ప్రముఖ కోలీవుడ్ నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో వేగంగా కారు నడుపుతూ.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పిపోయిన కారు సమీపంలో గుంటలోకి దూసుకుపోయి.. ఇరుక్కుంది. ఈ ఘటనలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతని కాలు విరిగిపోయింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియడంతో పాండిబజార్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారు. ధ్రువ్ నడిపిన కారును స్వాధీనం చేసుకున్నారు. రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆటో డ్రైవర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆటోడ్రైవర్.. (పక్కన) ధ్రువ్ కారు
తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళ రీమేక్‌తో ధ్రువ్ కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘వర్మ’గా ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తూ ధ్రువ్ ఈ మేరకు బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. కారు బ్రేకులు ఫెయిలవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం ధ్రువ్‌ను పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment