Chiyaan Vikram Health Bulletin Released By Kauvery Hospital - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram Health Bulletin: ఆయనకు గుండెపోటు రాలేదు: విక్రమ్‌ కుమారుడు

Published Fri, Jul 8 2022 6:12 PM | Last Updated on Fri, Jul 8 2022 10:27 PM

Chiyaan Vikram Health Bulletin Released - Sakshi

Chiyaan Vikram Health Bulletin Released: స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ ఆసుపత్రి పాలయ్యారు. శుక్రవారం (జులై 8) మధ్యాహ్నం విక్రమ్‌ అస్వస్థతకు గురికాడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఛాతీలో నొప్పి కారణంగానే విక్రమ్‌ ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. నిపుణలైన వైద్యులతో చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజామాన్యం పేర్కొంది. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, శనివారం ఉదయం డిశ్చార్జ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే విక్రమ్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విక్రమ్‌ తనయుడు ధృవ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాడు.  ఈ పోస్ట్‌లో 'ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులరా, నాన్నకు ఛాతీలో కొద్దిపాటి నొప్పికారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రాలేదు. ఈ పుకార్లు విని మేము చాలా బాధపడ్డాం. ఈ సమయంలో మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. మా చియాన్‌ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు' అని పేర్కొన్నాడు. 

మరోవైపు విక్రమ్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా నేడు (జులై 8) సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' టీజర్‌ లాంచ్‌కి విక్రమ్‌ హాజరు కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు విక్రమ్‌ కోబ్రా సినిమాలో కూడా నటిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement