తమిళ సినిమా: దర్శకుడు బాలా శైలి భిన్నంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేతు, నందా, పితామగన్ లాంటి చిత్రాలే అందుకు నిదర్శనాలు. నాన్‌కడవుల్, పరదేశీ, తారైతప్పట్టై వంటి చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. బాలా స్వీయ దర్శకత్వంలో చిత్రాలు నిర్మించడంతో పాటు ఇతర దర్శకులకు తన బ్యానర్‌లో అవకాశాలు ఇస్తుంటారు. కొద్ది కాలంగా విజయాలకు దురంగా ఉన్న ఈ సంచలన దర్శకుడు ‘నాచియార్’చిత్రంతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చారు. ఈ చిత్ర సక్సెస్‌కు చిత్ర పరిశ్రమ తోడవడంతో అర్ధ శతోత్సం దాటి ప్రదర్శితమవుతూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ప్రస్తుతం బాలా నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘వర్మ’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్. ఈ విషయాన్ని పక్కన పెడితే బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా లెన్స్ చిత్ర దర్శకుడు జయప్రకాశ్ రాధాకృష్ణన్‌కు అవకాశం ఇస్తున్నారు. లెన్స్ చిత్రం ఆంగ్లం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదలైంది. తమిళంలో లెన్స్ చిత్రాన్ని దర్శకుడు వెట్ట్రిమారన్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి గానూ జయప్రకాశ్ రాధాకృష్ణన్ గత ఏడాది గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయన తాజాగా ఒక మంచి కథను రెడీ చేశారట. దీన్ని దర్శకుడు బాలాకు వినిపించగా ఆయనకు బాగా నచ్చడంతో తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని మాట కూడా ఇచ్చారట. బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment