తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ మెప్పిస్తాడా! | Dhruv Vikram Look in Aditya Varma is Not Convening | Sakshi
Sakshi News home page

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ మెప్పిస్తాడా!

Published Thu, Jun 20 2019 12:49 PM | Last Updated on Thu, Jun 20 2019 12:49 PM

Dhruv Vikram Look in Aditya Varma is Not Convening - Sakshi

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్‌ కపూర్‌ హీరోగా ఒరిజినల్‌ను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే తెరకెక్కించాడు. కబీర్‌ సింగ్ పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే తమిళ రీమేక్‌ విషయంలో మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. విక్రమ్ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు ముందుగా బాలా దర్శకత్వం వహించారు. అయితే అవుట్‌పుట్ విషయంలో నిర్మాతలకు సంతృప్తి కలగకపోవటంతో అర్జున్‌ రెడ్డి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో తిరిగి రూపొందించారు.

ఆదిత్య వర్మ పేరుతో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్‌ ఇటీవల రిలీజ్‌ అయ్యింది. అయితే ఈ సారి కూడా ఆదిత్య వర్మ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో పాత్రకు ధృవ్‌ వయసు సరిపోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడిసిన్‌, పీజీ పూర్తి చేసిన వ్యక్తిగా ధృవ్‌ కనిపించటంలేదంటున్నారు విశ్లేషకులు. నటన పరంగా మెప్పించినా లుక్‌ కన్విన్సింగ్‌గా లేకపోతే కష్టమే అంటున్నారు. మరి ఈ విమర్శల నేపథ్యంలో తమిళ అర్జున్‌ రెడ్డి ఎం‍తవరకు మెప్పిస్తాడో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement