![Actor Dhruva Sarja his wife Prerana test positive for coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/16/dhruva-sarja.jpg.webp?itok=aRlDQlHd)
ధృవ్ సర్జా
ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు, హీరో ధృవ్ సర్జా తనకు, తన భార్య ప్రేరణకు కరోనా లక్షణాలు కనిపించాయని బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘త్వరలోనే మేమిద్దరం పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాం. అయితే ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసినవార ందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. నాతో తిరిగినవారందరూ ఆరోగ్యంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ధృవ్. ఇదిలా ఉంటే ఇటీవల హఠాన్మరణం పొందిన చిరంజీవి సర్జా సోదరుడే ధృవ్ సర్జా. ఇక కన్నడ పరిశ్రమలో కరోనా బారిన పడిన మరో సెలబ్రిటీ సుమలత. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆమె ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కి కూడా కరోనా లక్షణాలు కనిపించాయని వార్త వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment