
తెలుగు సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్యవర్మ’లో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. గిరీశాయ దర్శకత్వంలో రూపొందుతోంది. హిందీ చిత్రం ‘అక్టోబర్’ ఫేమ్ బన్నితా సాంధు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. నటి ప్రియా ఆనంద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ముకేశ్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. ‘‘చాలా వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పోర్చుగల్‌లో సాంగ్ షూట్ చేస్తున్నాం.
65 శాతం సినిమా పూర్తయింది. ఈ మధ్యే సినిమా ప్రారంభించాం. అంతలోనే 65 శాతం పూర్తి చేశాం. రికార్డు టైమ్’’ అన్నారు సినిమాటోగ్రఫర్ రవి. కె. చంద్రన్. ఇది వరకు ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ధ్రువ్ హీరోగా బాల దర్శకత్వంలో ‘వర్మ’ పేరుతో ప్రారంభమై, రిలీజ్‌కి రెడీ అయిన విషయం తెలిసిందే. కాకపోతే అవుట్‌పుట్ తాము ఆశించినట్లుగా రాలేదని భావించిన ఈ4 ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ వారు సినిమా మొత్తాన్ని రీ–షూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఆదిత్య వర్మ’గా టైటిల్‌ని మార్చారు. పూర్తయిన సినిమాని మళ్లీ మొదలుపెట్టి, తీయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment