
తెలుగు హిట్ ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. అవుట్‌పుట్ నచ్చక మళ్లీ ఈ సినిమా తీయాలని నిర్మాతలు అనుకున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ‘వర్మ’ను ప్రారంభించారు. రీషూట్ చేయాలనుకున్న తర్వాత హీరోగా ధృవ్‌నే ఉంచారు కానీ దర్శకుడు బాలా స్థానంలో గిరీశాయ అనే దర్శకుడిని తీసుకున్నారు. హీరోయిన్‌గా బన్నితా సాదును తీసుకున్నారు. రవి. కె చంద్రన్‌ను కెమెరామెన్‌గా తీసుకున్నారు టీమ్.
తాజాగా ఈ సినిమాకు ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు ధృవ్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక చిత్రదర్శకుడు గిరీశాయ గురించి చెప్పాలంటే... తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారట. అలాగే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన రధన్‌నే ‘ఆదిత్యవర్మ’కు మ్యూజిక్ అందించబోతుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా కంప్లీట్ చేసి జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment