
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్‌లో ధృవ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ధృవ్ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
విక్రమ్‌కు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే తన వారసుడ్ని రెండు భాషల్లో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్‌లో బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ధృవ్, తెలుగులో అందుకు భిన్నంగా ఓ క్లాస్ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధృవ్ టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment