
తమిళనాట డైరెక్టర్ బాలాకు ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. భిన్నంగా సినిమాలు తీస్తూ.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించిన బాలాకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కుతున్న వర్మ సినిమాను బాలా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే అవుట్‌పుట్ చూసిన నిర్మాతలు దానితో సంతృప్తి చెందలేదని, పూర్తి సినిమాను మళ్లీ రీషూట్ చేస్తామని ప్రకటించారు. హీరో ధృవ్ తప్పా మిగిలిన క్యాస్టింగ్ మొత్తాన్ని మార్చనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ బాలాను కూడా తప్పించడం తమిళ నాట హాట్ టాపిక్ అయింది. విక్రమ్ సూచన మేరకే నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు సమాచారం. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment