
‘‘దర్శకుడు బాలా రూపొందించిన ‘వర్మ’ చిత్రం మాకు సంతృప్తికరంగా లేదు. సినిమాను మళ్లీ మొదటి నుంచి చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ4 ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ పేర్కొంది. అయితే బాలా లాంటి దర్శకుడుని తప్పించడమేంటి? అనే కామెంట్స్ వినిపించాయి.
ఈ విషయంపై బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్‌మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్ విక్రమ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘వర్మ’ కొత్త ప్రాజెక్ట్‌ను దర్శకుడు గౌతమ్ మీనన్ టేకప్ చేస్తారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment