నిద్రపోతుండగా త్రిష బుగ్గ గిల్లింది.. | Chiyaan Vikram Son Dhruv Movie Varma Release in February | Sakshi
Sakshi News home page

త్రిష బుగ్గ గిల్లింది

Published Sat, Jan 5 2019 11:24 AM | Last Updated on Sat, Jan 5 2019 11:24 AM

Chiyaan Vikram Son Dhruv Movie Varma Release in February - Sakshi

సినిమా: నటి త్రిష నా బుగ్గ గిల్లింది అంటున్నాడు నవ కథానాయకుడు ధ్రువ్‌. సియాన్‌ విక్రమ్‌ వారసుడైన ఈయన వర్మ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆయన బి.స్టూడియోస్‌ సమర్పణలో ఈ 4 ఎంటర్‌టెయిన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మోడల్‌ మేఘ నాయకిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌.

నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. దీని విడుదల హక్కులను శక్తివేలన్‌ పొందారు. ఈ సందర్భంగా ఒక భేటీలో నవ నటుడు ధ్రువ్‌ను మీకు ఏ నటితో నటించాలని కోరిక అన్న ప్రశ్నకు బదులిస్తూ తనకు చిన్నతనం నుంచి నటి త్రిష అంటే చాలా ఇష్టమని, అయితే తానిప్పటి వరకూ ఆమెను కలిసింది లేదని చెప్పాడు. ఒకసారి ప్రివ్యూ థియేటర్‌లో తాను నిద్రపోతుండగా త్రిష తన బుగ్గ గిల్లి వెళ్లిపోయినట్లు ధ్రువ్‌ చెప్పారు. త్రిష ధ్రువ్‌ తండ్రి విక్రమ్‌ నటించిన స్వామి చిత్రంతోనే స్టార్‌ హీరోయిన్‌ స్థాయిని అందిపుచ్చుకుందన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement