తమిళ సినిమా : నటుడు విక్రమ్ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అవును ఇది ఆయన సంతోషంలో మునిగిపోతున్నారు. ఇందుకు కారణం విక్రమ్ వారసుడు దృవ్‌విక్రమ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆదిత్యవర్మ’. గత 22వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ అదిత్యవర్మ. దృవ్‌విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా బవిటసందు అనే బాలీవుడ్ నటి హీరోయిన్‌గా పరిచయమయ్యింది. అర్జున్‌రెడ్డికు కో–డైరెక్టర్‌గా పనిచేసిన గిరీసాయి ఆదిత్యవర్మ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ 4 ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై ముఖేశ్‌మెహ్తా నిర్మించిన చిత్రం ఆదిత్యవర్మ. కాగా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ కృతజ్ఞతలు చెప్పడానికి ఆదివారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో మీడియాతో సమావేశమయ్యారు.
చిత్ర దర్శకుడు గిరీసాయి మాట్లాడుతూ ఈ చిత్రానికి నటుడు విక్రమ్ సహకారం ఎంతో ఉందన్నారు. ఆయన లేకుంటే ఆదిత్యవర్య లేదన్నారు. దృవ్‌విక్రమ్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆదిత్య పాత్రకు దృవ్ ప్రాణం పోశారని అన్నారు. భవష్యత్‌లో ఆయన పెద్దస్టార్ హీరో అవుతారని అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశం కలి్పంచిన చిత్ర నిర్మాతలకు, నటుడు విక్రమ్‌కు దన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్రం కోసం తనకుంటే ఎక్కువగా తన తండ్రి విక్రమ్ శ్రమించారని చెప్పారు. ఆయన ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి సారించేవారని అన్నారు. తన తండ్రి ఈ చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమించినట్లు తెలిపారు. నాన్న లేకపోతే తాను లేనన్నారు. నాన్నకు తాను పెద్ద అబిమానిని చెప్పారు. ఆయన కోసం ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు.
ఆదిత్యవర్మ చిత్రం సమష్టి కృషి అని, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. సంగీత దర్శకుడు రతన్ తనతో ఈ చిత్రంలో ఒక పాటను కూడా పాడించారని తెలిపారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పేదేమీ లేదని, ఆదిత్యవర్మ చిత్రం గురించి ప్రేక్షకులే చెబుతున్నారని అన్నారు. తాను నటించిన చిత్రం విడుదల కంటే తన కొడుకు నటించిన చిత్రం విడుదలే పెద్ద విషయంగా ఉందన్నారు. చాలాసంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అదేవిధంగా తన కొడుకును కథానాయకుడిగా పరిచయం చేసిన నిర్మాత ముఖేశ్ మెహ్తా, చిత్ర దర్శకుడు గిరిసాయికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని విక్రమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment