
టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా తమిళ అర్జున్ రెడ్డికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. ముందుగా బాల దర్శకత్వంలో ఈ రీమేక్ చిత్రీకరించారు. కానీ అవుట్ పుట్ నచ్చకపోవటంతో ఆ వర్షన్ పూర్తిగా పక్కన పెట్టేసి కొత్తగా కొత్త దర్శకుడితో సినిమా మొత్తం రీషూట్ చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వ శాఖలో పని చేసిన గిరీశయ్య దర్శకత్వంలో ఆదిత్య వర్మ పేరుతో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 65 శాతానికి పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బనితా సందు హీరోయిన్ నటిస్తోంది. రథన్ సంగీతమందిస్తున్నాడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.