
తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్‌లో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కోసం ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఓ అమ్మాయి ముఖం కనిపించకుండా షూట్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన హీరో విక్రమ్, ‘ఈమె కనబడటం లేదు. ఒకవేళ ఈమె మీరే అయినా..లేక మీరు ఈమెలాగే ఉన్నా.. మీ ఫొటోలను వీడియోలను మాకు పంపించండి. నిన్ను కలిసేందుకు ఎదురుచూస్తున్న. సమయం తీసుకోండి. కానీ త్వరపడండి’అంటూ కామెంట్ చేశాడు. హీరోయిన్ ఎంపిక కోసం వర్మ టీం రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment