
గత ఏడాది సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కోలీవుడ్ ఈ సినిమాను విక్రమ్ తనయుడు ధృవ్ మీరోగా తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను విలక్షణ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తుండటంతో సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది.
వర్మ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ ను చాలా కాలం క్రితమే రిలీజ్ చేశారు. అయితే కథలోని క్యారెక్టర్‌కు తగ్గ లుక్ కోసం ధృవ్ ఆరు నెలలుగా కష్టపడుతున్నాడు. తాజాగా సినిమాకు తగ్గ మేకోవర్‌తో రెడీ అయిన ధృవ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. బాగా పెరిగిన గెడ్డం, మీసంతో ధృవ్ రఫ్ లుక్‌లో అదరగొడుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment