
‘‘ముద్దు పెట్టుకోవడం కూడా ఒక ఎమోషన్. నటిస్తున్నప్పుడు ఏ ఎమోషన్ అయినా ప్యాషన్‌తో చేయాల్సిందే. ‘అర్జున్‌రెడ్డి’లో షాలినీ పాండే కనపడదు. ముద్దు పెట్టుకున్నది షాలినీ పాండే అనిపించదు. ‘ప్రీతి’గానే ముద్దు పెట్టుకున్నాను.. ‘ప్రీతి’గానే అనిపిస్తాను. నిజానికి షాలిని విజయ్ దేవరకొండను ముద్దుపెట్టుకోలేదు. ప్రీతి అర్జున్‌రెడ్డిని ముద్దు పెట్టుకుంది’’ అంటున్నారు ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ ఇచ్చిన షాలినీ పాండే.
ఏంటండీ... షాలినిగారూ.. హండ్రెడ్ పర్సంట్ లవ్‌లో ఉన్నట్లున్నారు?
ఎగ్జాట్లీ. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. చిన్ని చిన్ని అలకలు, పెద్ద పెద్ద గొడవలు, తీపి కబుర్లు, కొంటె చూపులు.. సూపర్బ్.
ఆన్‌స్క్రీన్ లవ్ (తెలుగు ‘100% లవ్ ’ తమిళ రీమేక్‌లో కథానాయికగా నటిస్తున్నారు షాలిని) గురించి భలే చెప్పారు.. ఆఫ్ స్క్రీన్ ప్రేమ గురించి?
ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇప్పటివరకూ ఒక్కరు కూడా ‘ఐ లవ్ యు’ చెప్పలేదు. అందుకే, ప్రేమంటే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ తెలుసుకుంటున్నా.
ఇంత అందమైన అమ్మాయికి ఒక్కళ్లు కూడా ప్రపోజ్ చేయలేదా? ఫాల్ట్ మీదేనేమో?
అవునండి. నేను కొంచెం తేడానే. ఏది చేసినా ఫుల్‌గా కాన్‌సన్‌ట్రేట్ చేస్తా. స్కూల్ డేస్‌లో పుస్తకాల్లో మునిగిపోయేదాన్ని. కాలేజ్ డేస్‌లోనూ అంతే. దాంతో నాకు ఎమోషన్స్ ఉండవని, మరబొమ్మ టైప్ అనీ అబ్బాయిలు అనుకునేవారు (నవ్వుతూ). అయినప్పటికీ నన్ను ఇష్టపడ్డవాళ్లు ఉన్నారు. అయితే, ఆ ఇష్టాన్ని నాతో డైరెక్ట్‌గా చెప్పకుండా నా ఫ్రెండ్స్‌తో చెప్పేవారు. ఏం లాభం చెప్పండి?
మరి.. మీరు ఎవరి మీదైనా మనసు పారేసుకున్నారా?
ప్చ్... ఇప్పటివరకూ లేదు. అప్పుడేమో చదువులు. ఇప్పుడేమో యాక్టింగ్. మైండ్ అంతా వర్క్ మీదే.
ఓకే.. ఫ్రమ్ జబల్‌పూర్ టు హైదరాబాద్‌కి హీరోయిన్‌గా వచ్చారు. సినిమాల్లోకి రావాలని చిన్నప్పటినుంచే అనుకున్నారా?
అవును. హీరోయిన్ అయ్యే తీరాలన్నది నా యాంబిషన్. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయి. నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. కానీ, నేను హీరోయిన్ అవుతానంటే కాదనలేదు. ఎందుకంటే, నేనేది చేసినా ఒక కమిట్‌మెంట్‌తో చేస్తానని ఆయన నమ్మకం. ముందు నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. అక్కణ్ణుంచి మోడల్‌గా ట్రై చేద్దామనుకున్నా. అట్నుంచి సినిమాల్లోకి రావాలనుకున్నా. తెలుగు సినిమాతో నా కల నెరవేరింది.
ఫస్ట్ మూవీ (‘అర్జున్‌రెడ్డి’) హిట్టయింది కాబట్టి హ్యాపీగా ఉన్నారు. తేడా జరిగి ఉంటే?
కొలాప్స్ అయ్యేదాన్ని కాదు. కొంచెం బాధ మాత్రం ఉండేది. అయినా ఫెయిల్యూర్స్ నాకు కొత్త కాదు. ముంబైలో చాలానే ఫేస్ చేశాను. ఎన్నో రిజెక్షన్స్. అన్నీ తట్టుకున్నాను. లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నా. అందుకని అంత ఈజీగా హర్ట్ అవ్వను.
అది సరే.. ఫస్ట్ సినిమాకే అన్నేసి ముద్దు సీన్స్ చేశారు... ఇబ్బందిగా అనిపించలేదా? మిమ్మల్ని తక్కువగా మాట్లాడతారని భయపడలేదా?
నేను థియేటర్ నుంచి వచ్చానని చెప్పాను కదా. అక్కడ మాకు ఒకటే నేర్పించారు. ‘నువ్వు ఏ పాత్ర అయితే చేస్తున్నావో అక్కడ ఉన్నది నువ్వు కాదు. ఆ క్యారెక్టర్ మాత్రమే’ అని. నా మనసులో అది బలంగా నాటుకుపోయింది. నేను షాలినిగా ముద్దులు పెట్టలేదు. ప్రీతీ (‘అర్జున్‌రెడ్డి’లో షాలిని క్యారెక్టర్ పేరు)గా పెట్టా. నటిగా ఎంతో ప్యాషన్‌తో ఆ సీన్స్ చేశా.
ఇంజినీర్‌గా చూడాలనుకున్న మీ నాన్నగారు మీరు హీరోయిన్ అవుతానన్నా ఒప్పుకున్నారు. మరి.. ముద్దు సీన్స్ చేసే ముందు ఆయనతో చెప్పారా? పర్మిషన్ తీసుకున్నారా?
బేసిక్‌గా నేను ఎవరి అడ్వైస్ తీసుకునే టైప్ కాదు. నిర్ణయాలు నావే. దాని తాలూకు సక్సెస్, ఫెయిల్యూర్స్ నావే. జీవితంలో ఎవర్నీ బ్లేమ్ చేయాలనుకోను. అందుకే సలహాలు తీసుకోను. ఆ సినిమాకి అది కరెక్ట్ అనిపించింది. పైగా డైరెక్టర్ సందీప్‌గారు చాలా ఏస్థటిక్‌గా తీస్తారని నమ్మాను. అందుకే చేశాను. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేసి ఉండకపోతే మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు.
సినిమా చూశాక మీ అమ్మానాన్న ఏమన్నారు?
నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ‘షాలిని ఏది చేసినా ఒక కమిట్‌మెంట్ కనిపిస్తుంది’ అని నా చెల్లెలితో నాన్న అన్నారు. అది చాలు.
రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చుట్టూ పది మంది ఉంటే ఇబ్బందిగా ఉంటుందేమో. పైగా మీలాంటి కొత్త హీరోయిన్‌కి అయితే కష్టమేమో?
ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూలో నేను కొత్త అయ్యుండొచ్చు. కెమెరా ఫేస్ చేయడం నాకు కొత్త కాదు. కొన్ని నాటకాల్లో నటించాను. అప్పుడు కెమెరాలో షూట్ చేశారు. ఫొటోషూట్స్ చేశాను. సో.. నాకేం ఇబ్బంది అనిపించలేదు. ‘కిస్సింగ్’ అనేది ఒక ఎమోషన్ అని సందీప్‌గారు చెప్పారు. అవును కదా.. నవ్వు, ఏడుపులా అది కూడా ఒక ఎమోషనేగా. దానికి అంత ఇబ్బంది ఎందుకు? అనిపించింది.
మరి.. రొమాంటిక్ సీన్స్ చేశాక... మీరు, విజయ్ దేవరకొండ మామూలుగానే మాట్లాడుకోగలిగారా? ఇబ్బందేమైనా?
నెవర్ అండి. కెమెరా ముందు మేం అర్జున్ – ప్రీతి. ఆ తర్వాత విజయ్, షాలిని. అందుకని బాగానే మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్.
‘కిస్సింగ్’ అనేది ఎమోషన్ కాబట్టి చేశానన్నారు. మరి.. సీన్ డిమాండ్ చేస్తే బికినీ ధరిస్తారా? అది ఫిజిక్‌ని బయటపెట్టేస్తుంది కదా?
స్టోరీ డిమాండ్ చేస్తే నేను ఏది చేయడానికైనా రెడీ. కానీ, డైరెక్టర్ ఎలా తీస్తారు? అనేది మాత్రం చూసుకుంటా. నన్ను చీప్‌గా చూపించే సీన్స్ చేయను. చీప్‌గా కనిపించే కాస్ట్యూమ్స్ వేసుకోను.
కానీ, కొంచెం బొద్దుగా ఉన్నారు కాబట్టి మీ ఫిజిక్‌కి బికినీ సూట్ కాదేమో?
‘అర్జున్‌రెడ్డి’లో ప్రెగ్నెంట్ ఉమన్‌గా కనిపించాల్సి వచ్చింది కాబట్టి, బరువు పెరిగాను. ఇప్పుడు సన్నబడి పోయాను. తెలుగు ‘100% లవ్’ తమిళ రీమేక్‌లో యాక్ట్ చేస్తున్నాను కదా. ఆ సినిమాలో టీనేజ్ గాళ్‌గా కూడా కనిపించాలి కాబట్టి తగ్గాను.
తమన్నా ఓ పది సినిమాలు చేశాక ‘100% లవ్’ ఒప్పుకున్నారు. ఫుల్ పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. మీరేమో జస్ట్ వన్ మూవీ ఓల్డ్. మరి చేయగలుగుతారా?
ఇది నాకు చాలెంజింగ్. ఆ సినిమా చూశాను. తమన్నా చాలా బాగా చేశారు. నేను ఆమెలా చేయను. నాలా చేస్తాను. క్యారెక్టర్‌కి న్యాయం చేయగలననే నమ్మకం ఉండబట్టే ఒప్పుకున్నా. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఏ సినిమా ఒప్పుకున్నా, నేను చేయగలననే నమ్మకం ఉంటేనే ‘యస్’ అంటా.
సీనియర్ నటి సావిత్రిగారి జీవితం ఆధారంగా తీస్తోన్న ‘మహానటి’లో చేస్తున్నారు కదా.. మీ క్యారెక్టర్ గురించి?
డీటైల్స్ చెప్పలేను. ఇంకా టైమ్ ఉంది. ‘అర్జున్‌రెడ్డి’లో కనిపించిన షాలిని వేరు.. ఈ సినిమాలో కనిపించబోతున్న షాలిని వేరు.
ఫైనల్లీ డ్రీమ్ రోల్ ఏదైనా?
నేను మంచి ఆకలి మీద ఉన్న హీరోయిన్‌ని. ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలనుకుంటున్నాను. అదే నా డ్రీమ్ రోల్ అనుకుని, చేస్తా. తమిళంలో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా కథలు వింటున్నాను. సో.. కెరీర్ గురించి ఫుల్ పాజిటివ్‌గా ఉన్నాను.
ఆల్ ది బెస్ట్ షాలిని.. థ్యాంక్యూ .
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment