
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి అర్జున్ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన అర్జున్ రెడ్డిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన సామ అర్జున్ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన మాట్లాడిన అర్జున్.. మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు. అర్జున్ మృతి వార్త వినగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment