
తెలుగు నాట సంచలన విజయం సాధించిన బోల్డ్ సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్లో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా హిందీలో షాహిదీ కపూర్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ వర్షన్‌ను కూడా సందీపే డైరెక్ట్ చేయనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమాకు హీరోయిన్‌గా బుల్లితెర నటి తారా సుతారియాను ఫైనల్ చేశారట. ఇప్పటికే టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో నటిస్తున్న తారా, అర్జున్ రెడ్డి రీమేక్‌లో షాహిద్ సరసన నటించనుంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను మురద్ ఖేతాని, అశ్విన్ వర్దేలు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment