అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌లో కూడా విజయ్‌కి మంచి క్రేజ్ రావటంతో బాలీవుడ్ ఎంట్రీపై కూడా కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చారు.
83లో విజయ్ దేవరకొండ నటించటం లేదని తెలుస్తోంది. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తే హీరోగానే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న విజయ్, కపిల్ బయోపిక్ ఆఫర్‌కు నో చెప్పటంతో ఆ పాత్రకు తమిళ యువ కథానాయకుడు జీవాను తీసుకున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment