అర్జున్‌రెడ్డికి నో... | Ranveer Singh says NO to Arjun Reddy Remake | Sakshi
Sakshi News home page

అర్జున్‌రెడ్డికి నో...

Published Thu, Dec 28 2017 1:31 AM | Last Updated on Thu, Dec 28 2017 1:31 AM

Ranveer Singh says NO to Arjun Reddy Remake - Sakshi

షాహిద్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్‌

...అవును. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటించేందుకు రణ్‌వీర్‌ సింగ్‌ ‘నో’ చెప్పారట. విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే జంటగా సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం టాలీవుడ్‌లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో హీరో, హీరోయిన్, డైరెక్టర్, స్నేహితుడి పాత్రధారి రాహుల్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌లుగా మారిపోయారనడం అతిశయోక్తి కాదేమో. తెలుగునాట ఇంతటి విజయం సాధించిన ఈ సినిమాను హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్‌ చేసేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

హిందీ, కన్నడ భాషల్లో ఇతర దర్శకులు రీమేక్‌ చేస్తున్నా హిందీకి మాత్రం సందీప్‌ రెడ్డే దర్శకత్వం వహిస్తారనీ, రణ్‌వీర్‌సింగ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తారని వార్తలు వినిపించాయి. రణ్‌వీర్‌కి కథ వినిపించడంతో నటించేందుకు తొలుత గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారట. ‘అర్జున్‌రెడ్డి’  కంటెంట్‌ బోల్డ్‌గా ఉండడమే ఇందుకు కారణమట. ‘పద్మావతి’ సినిమాలో రణ్‌వీర్‌ చేసిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రే ఇప్పటికే వివాదం కావడంతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి మరో వివాదాస్పద పాత్రలో నటించడం ఇష్టం లేక ‘నో’ చెప్పారట. రణ్‌వీర్‌ స్థానంలో ఇప్పుడు షాహిద్‌ కపూర్‌ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు షాహిద్‌నే ఖరారు చేసే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement